భక్త రక్షణ

షిర్డీ సాయి బాబా లీలలు

Shirdi Sai Baba
Shirdi Sai Baba

సాయిబాబాను దత్త సంప్రదాయానికి చెందిన వానిగా, నవ నాథ సంప్రదాయానికి చెందిన వానిగా భక్తులు భావిస్తారు.. శంకర మహారాజ్ విషయంలోనూ అంతే.. గణేష్ మాధవ్ అభయ శంకర్ శంకర్ మహారాజ్ భక్తుడు… రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు.. ఆ యుద్ధపు రోజుల్లో కూడా ఆయన మిలిటరీ క్యాంపు లో గురుచరిత్ర పారాయణ చేసేవాడు కాదు.. ఒకసారి సాయంకాలం ఆ రోజు యుద్ధం ముగిసిన తర్వాత , క్యాంపు లో బట్టలు మార్చుకుంటున్నాడు ఆయన.. ఆయన ధరించిన ప్యాంటు కింది భాగం కాలి అడుగు భాగం తూట్లు పడి ఉన్నాయి… ఇంకా పరీక్షగా చూసుకున్నడు. కాళ్లకు , పాదాలకు గాయాలు లేవు… ఆ విషయం ఆశ్చర్యం కల్గించింది ఆయనకు.. యుద్ధానంతరం ఇంటికి చేరుకున్నాడు. తన గురువైన శంకర్ మహారాజ్ కూడా వచ్చారు .. అభయ శంకర్ మహారాజ్ పాదాలకు నమస్కరించాడు..

శంకర్ మహారాజ్ కాళ్లకు పాదాలకు తుపాకీ గుళ్ల గాయాలున్నాయి.. ‘ ఆ గాయాలేమిటి? అని ప్రశ్నించాడు అభయ శంకర్… చిరునవ్వు నవ్వి ‘ మీ పాదాలకు కాళ్లకు తగలవలసిన తుపాకీ గుళ్ళు నా కాళ్లకు, పాదాలకు తగిలాయి.. ప్యాంటు కింది భాగం కాలటం , ప్యాంటు కు తూట్లు పడటం జరిగింది… దత్తాత్రేయ స్వామి నిన్ను రక్షింపమన్నాడు.. అని ఆ యుద్ధం లో జరిగిన ప్రతి సంఘటనను వివరించి చెప్పారు.. శంకర్ మహారాజ్ .. అభయ శంకర్ ఆయన పాదాలకు కన్నీటితో కడిగాడు.. గురువు రుణం తీర్చుకోగలమా? ..

బెంగుళూరు లో బుర్రిట్ ఒక బ్రాందీ షాపు యజమాని.. అప్పుడింకా బ్రిటీష్ ప్రభుత్వమే దేశాన్ని ఏలుతుంది.. బుర్రిట్ పై ఆంగ్ల ప్రభుత్వానికి కోపం వచ్చి ఏదో కుంటి సాకు చూపించి షాపు ఆస్తి పాస్తులన్నిటినీ జప్తు చేసింది.. ధనవంతుడు బుర్రిట్ పేద వాడయ్యాడు… శంకర్ మహారాజ్ ఆయనను కోర్టు కు వెళ్ళమన్నాడు.. కోర్టు ఆంగ్ల ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

పై కోర్టు కు వెళ్లామన్నారు శంకర్ మహారాజ్ .. కనపడ్డ చోటల్లా అప్పు చేసి, డబ్బు తెచ్చి కోర్టు కు పోయాడు బుర్రిట్ . అక్కడ కూడా ఓడిపోయాడు. శంకర్ మహారాజ్ ను నమ్మటం పొరపాటైందని అనుకున్నాడు . ఈ బుర్రిట్ ఎవరినీ మోషం చేయదు ఇంకా అంతా అవలేదు.. తీర్పు వచ్చిన రోజు శిలకు నీవు నమస్కారం చేస్తావు అన్నారు శంకర్ మహారాజ్ బుర్రిట్ తో సంవత్సరాలు గడిచాయి…

స్వాతంత్య్రం వచ్చింది.. బ్రిటీష్ ప్రభుత్వం రాజకీయ కక్షలతో అన్యాయంగా పెట్టిన కేసులన్నింటినీ కొట్టివేసింది.. అందులో బుర్రిట్ కేసు కూడా వుంది… బుర్రిట్ కు లక్ష రూపాయల నష్ట పరిహారం కూడా ఇచ్చింది.. శంకర్ మహారాజ్ వద్దకు బయలు దేరాడు. ఆయన 28.4..1947 న మహా సమాధి చెందారని తెలిసి విలపించాడు బుర్రిట్ . నమ్మిన వారిని నట్టేట ముంచాడు శంకర్ మహారాజ్ .. నేడు శంకర్ మహారాజ్ సమాధి చెందిన రోజు ఏప్రిల్ 28… ఆయన వైపు ఒక అడుగు వేద్దాం… అడుగులు ఆయన మనవైపు వేస్తాడు.. ‘ సద్గురు శంకర్ మహారాజ్ కీ జై..

‘చెలి ‘ (మహిళల ప్రత్యేకం ) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/women/