టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై 10 లక్షల ఫైన్​ వేసిన GHMC

నిన్న ఏప్రిల్ 27 టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ సందర్భాంగా హైదరాబాద్ లోని HICC లో ప్లీనరీ సభ ఏర్పటు చేయడం జరిగింది. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు నగరమంతా గులాబీమయం చేసారు. భారీ భారీ ప్లెక్సీ లు , కటౌట్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే నగరంలో ప్లెక్సీ లపై నిషేధం ఉన్నప్పటికీ..నగరంలో నేతలు భారీ ఎత్తున ప్లెక్సీ లు ఏర్పాటు చేయడం పట్ల సామాన్య ప్రజలు, ప్రతిపక్ష పార్టీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున కామెంట్స్ పెట్టారు.

ఆలాగే GHMC అధికారులకు పిర్యాదు చేసారు. ఈ క్రమంలో GHMC సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు ..హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లకు భారీగా ఫైన్ వేసింది. అత్యధికంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రూ.2 లక్షలకు పైగా ఫైన్ వేయగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ. లక్షకు పైగా, మరో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు రూ.50 వేలకు పైగా ఫైన్లు వేశారు. మొత్తం ప్లీనరీకి సంబంధించి రూ.10 లక్షలకు పైనే జరిమానాలు విధించారు.