సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ బోనాలకు ముహూర్తం ఫిక్స్‌

Secunderabad Ujjaini Mahankali Bonalu muhurtham fix

హైదరాబాద్‌ః సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు ముహూర్తం ఖరారు అయింది. మహాంకాళి బోనాలను జులై 9వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. జులై 10న రంగం(భవిష్య వాణి) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రి తలసాని పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం నలుదిక్కులా చాటిందని అన్నారు. బోనాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.