ఈసారి భక్తుల్లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఆలయం లోపలే బ్రహ్మోత్సవాలు

brahmotsavams
TTD Chairman YV Subba Reddy

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధికమాసం కారణంగా ఈసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని వెల్లడించారు. సెప్టెంబరు 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పారు. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్వామివారి వాహన సేవలు తిరుమల మాడవీధుల్లో నిర్వహించడం వీలుకాదని, అందుకే బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని వివరించారు. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గితే తదుపరి బ్రహ్మోత్సవాలను పూర్వరీతిలో వెలుపల నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్‌లో ఉత్సవాల సమయానికి కరోనా ప్రభావం తగ్గితే యథాతథంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/