దేశంలో కొత్తగా 3,303 కరోనా కేసులు

హైదరాబాద్: దేశంలో కరోనా రోజువారి కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3,303 నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,68,799కు చేరింది. ఇందులో మొత్తం 4,25,28,126 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో 39 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,23,693కి పెరిగింది. దేశవ్యాప్తంగా 2563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో 16,980 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,88,40,75,453 మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/