2వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన: ధనుర్మాసం ప్రత్యేకం

Sri Goda Devi
Sri Goda Devi

వైయత్తు వాళ్వీర్‌ కాళీ!
నాముమ్‌ నమ్‌ పావైక్కు
శెయ్యుమ్‌ కిరిశైగళ్‌ కేళీరో, పాఱ్కడలుళ్‌
పైయత్తుయిన€పరమనడిపాడి,
నెయ్యుణ్ణోమ్‌ పాలుణ్ణోమ్‌ నాట్కాలే నీరాడి
మైయొట్టెళుతోమ్‌ మలరిట్టు నాముడియోమ్‌
శెయ్యాదన శయ్యోమ్‌ తీక్కుఱళై చ్చెనో€దోమ్‌,
ఐయముమ్‌ పిచ్చైయు మాన్దనైయుమ్‌ కైకాట్టి,
ఉయ్యుమాఱెణ్ణి యుకన్దేలో రెమ్బావామ్‌.

భావం: ఈ లోకములో ఆనందం అనుభవింపదలచిన గోపికలారా! ఈ వ్రతమునకు చేయవలసిన కార్యక్రమములను వివరంగా వినండి.
పాలసముద్రంలో నిదురించుచున్న పరాత్పరుని పాదముల గురించి మెల్లగా పాడుదాం. తెల్లవారుఝూముననే స్నానము చేసి, కన్నులను కాటుకతో అలంకరిం చక పూలను తలలో ముడవక, ఇతరులకు, బాధలు కలిగించు మాటలు అనక
జ్ఞానులు తృప్తి పొందు వరకు భిక్షను ఇచ్చి, జీవించు విధానమును అలవాటు చేసుకొందము. ఇదంతా విని మీరు ఆనందించాలని నా కోరిక అని గోపిక ఇతర గోపికలను ఆహ్వానిస్తున్నది.
ఫలం: మంచి చెడుల విషయం తెలుసుకొనే జ్ఞానం.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/