వెన్నునొప్పి నుంచి ఉపశమనం కోసం
వ్యాయామం – ఆరోగ్యం

ప్లాంక్స్ … సులువుగా చేయగలిగే వ్యాయామం.. దీంతో శరీరం దృఢంగా మారుతుంది.. ప్లాంక్స్ చేయటం మొదట్లో కష్టంగా అన్పించినప్పటికీ రోజూ సాధన చేయటం వలన లాభాలు చాలానే ఉంటాయి.. అవి ఏమిటంటే …
భుజాలు, చేతులు బలంగా తయారవుతాయి.. చక్కని ఆకృతిని పొందుతాయి..
ఎముకలు, కీళ్లు, కండరాల స్థానంలో మార్పు రాదు. ప్లాంక్స్ చేస్తే వెన్ను కండరాలు బలోపేతం అవుతాయి.. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది..
రోజూ ప్లాంక్స్ చేస్తే అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి.. జీవ క్రియ రేటు పెరుగుతుంది.
కండరాల అలసట, ఒత్తిడి తగ్గుతుంది.. మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/