ఆస్తమా..లక్షణాలు, కారణాలు..

ఆరోగ్య భాగ్యం

ఆస్తమా .. ఇది దీర్ఘ కాలిక శ్వాసకోశ వ్యాధి… దీన్ని ఉబ్బసం చైల్డ్ హుడ్ ఆస్తమా అని అంటారు.. ప్రపంచ వ్యాప్తంగా 262 మిలియన్ల ప్రజలు ఆస్తమా తో ఎఫెక్ట్ అయినారు.. యుఎస్ లో 7 మిలియన్ల మంది , ఇండియా లో 1.5 నుంచి 2 కోట్ల మంది ఆస్తమా బాధితులు ఉన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా 12 % మంది ఆస్తమా బాధితులే.. ఇది నూటికి 5-15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువగా కన్పిస్తుంది.. జనాభాలో వీరి శాతం 15.20 % ఉంది .

జెనెటిక్ కారణాలు:
ఇంట్లో కానీ, వంశంలో కానీ ఎవరికైన ఆస్తమా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది . 100 రకాలు జీన్స్ ముఖ్యంగా 2,5,6,12, 13 క్రోమోజోమ్స్ వలన జెనెటిక్ ఆస్తమా, అలెర్జీలు వస్తాయి.

ఎలర్జీస్ :
దుమ్ము, ధూళి, పూల పుప్పొడిలు, జంతువుల వెంట్రుకలు, మల మూత్రాలు, నల్లులు, టిక్స్, ఆహార పదార్ధాలు, ఘాటైన వాసనలు, పరిశుభ్రత, బూజులు, మొదలైనవి..

ఇన్ఫెక్షన్స్ :
సైనసైటిస్, జిలుబు , చెవి , ముక్కు, గొంతు వ్యాధులు, ఇతర శ్వాస కోసం ఇన్ఫెక్షన్స్, ఫ్లూ జ్వరం, అంటువ్యాధులు..

వృత్తులు:
కొన్ని బొగ్గు, ఆస్బెస్టాస్, గన్నుల్లో పనిచేసే కొన్ని వృత్తి పనివారితో సామాన్యంగా కన్పిస్తుంది.

పారిశ్రామీకరణ:
అర్బన్ ఏరియాలో లైఫ్ స్టైల్ ఫాక్టర్స్, వాయు, శబ్ద కాలుష్యము, పేదరికం జన సామర్ధ్య మున్నా మురికి వాదాలు, గాలి వెలుతురూ లేని ఇరుకైన ఇళ్ళు , పరిశ్రమల కాలుష్యం., వర్షాలు, మురికి కాల్వల నిర్వహణ సరిగా లేకపోవటం, అధిక ఉష్ణోగ్రత, వ్యధ పదార్ధాలు, చెత్త, చెదారాలు మొదలగునవి.

మానసిక వత్తిళ్లు:
శ్రమ, స్ట్రెస్ , మానసిక వ్యాధులు.

పోష కాహార లోపం రోగ నిరోధక శక్తి తక్కువగా వున్నవారు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల్లో ఆస్తమా వచ్చే అవకాశం ఉంది .

కొన్ని రకాల మందుల వలన ముఖ్యంగా ఆస్ప్రిన్, పెయిన్ కిల్లర్స్, కార్టికో స్టెరాయిడ్స్ , మందుల రియాక్షన్, కొన్ని రకాల మందులు పడక పోవటం వలన కూడా ఆస్తమా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

  • డాక్టర్ కె ఉమాదేవి , తిరుపతి

మరిన్ని ఆరోగ్య విషయాల కోసం ‘స్వస్థ’ : https://www.vaartha.com/category/specials/health/