ఒత్తిడిని జయించే పుస్తక పఠనం

మానసిక వికాసం

Reading book
Reading book

ఒకప్పుడు కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు. అందుకే ఇంట్లో చిన్న వారి నుండి పెద్ద వారి దాకా చదివే పుస్తకాలు మాత్రమే ఉండేవి.

పిల్లలు పత్రికలు, వార పత్రికలు, మాసపత్రికలు ఇలా ఎన్నో పుస్తకాలు కాలక్షేపాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేవి. మారిన కాలంలో పుస్తకాలు పట్టుకుని చదవడం తగ్గిపోయింది.

ఎందుకంటే వినోదాన్ని అందించే సాధనాలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి.

దాంతో పుస్తకాలను చదవడం పెద్ద పనిగా అనిపిస్తున్నది. అయినప్పటికీ ఇప్పటికీ పుస్తకాలు చదివే వారు మనలో చాలా మందే ఉన్నారు.

పుస్తకం చదివే అలవాటు ఎన్నో రకాలుగా మేలు చేస్తుందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని నిపుణులు అంటున్నారు. పుస్తకం చదవటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

రోజు ఒక అరగంట చదివినా చాలు. ఆ సమయంలో మనసు, మెదడు అనుసంధానం జరిగి అదో మెడిటేషన్‌లా మారుతుంది. మతిమరుపు వస్తుందనుకుంటే పుస్తకం చదవడం ప్రారంభించాలి

దాంతో మెదుడులోని న్యూరాన్లు చురుకుగా మారుతాయి. చూడటం, చదవడం, గ్రహించడం, చదివినదాన్ని నిక్షిప్తం చేసుకోవడం వల్ల ఇలా అన్నీ ఒకేసారి జరిగే ప్రక్రియతో మెదడుకి ఒక ఛాలెంజ్‌గా అనిపిస్తుంది.

ఆ ఛాలెంజ్‌ న్యూరాన్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పుస్తకం చదివితే వయసు ప్రభావం మెదడు మీద లేకుండా చేస్తుందని ఒక పరిశోధన ద్వారా వెల్లడయింది.

బాగా చదివే అలవాటు ఉన్నవారి మెదడు, వయసు వారి శారీరక వయసు కంటే తక్కవగా ఉండటాన్ని ఈ పరిశోధనలో గుర్తించారు.

మానసిక దృఢత్వం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఇలా ఎన్నో జీవన నైపుణ్యాలు ఒక్క పుస్తక పఠనానికే ఉన్నాయని నిపుణులు స్పష్టంగా చెపుతున్నారు.

ఒక్క పుస్తకం చేతిలో ఉంటే ఎందరో మనతో ఉన్నట్లేనని, మానసిక ప్రశాంతత, ఉత్సాహం అన్నీ లభిస్తాయంటున్నారు.

ఒత్తిడికి సులువైన మార్గం పుస్తకం పఠనం. అందుకే చదవడం మొదలుపెట్టగానే శరీరం, మనసు రెండూ రిలాక్స్‌ అవటం మొదలవుతుంది.

ఇక భాషాజ్ఞానం పెరగటం వంటి లాభాలు అందరికి అన్ని విధాలుగాఎంతో మేలు చేయడం ఈ పుస్తక పఠనం వల్ల అని తెలుసుకుంటే పుస్తకంతో దోస్తీ చేయక మానరు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/