వ్యాయామంతో జబ్బులు దూరం

ఆరోగ్య సంరక్షణ

Avoid diseases with exercise
Avoid diseases with exercise

మనకు వ్యాయామం అవసరమా? అనుకోవద్దు. అన్నిటికి మించి ఎల్లవేళలా సానుకూల దృక్పథంతో ఉండగలిగితే మానసికానందం, తద్వారా ఆర్యోగానికి మేలు కలుగుతుంది. జబ్బుల బారిన పడకూడదంటే ప్రతిరోజు మూడు లీటర్ల మంచినీరు తాగాలి.

పరగడుపున రెండు గ్లాసుల మంచి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగపడుతుంది. చర్మం బాగా హైడ్రేట్‌ అయి ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తరువాత ప్పనిసరిగా వ్యాయామం చేయాలి. దాంతో మనసు ప్రశాతంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.

ఉదయంపూట అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. ఒక కప్పు పాలు తీసుకున్నా ఎముకలు దృఢపడతాయి. పన్నెండు గంటల నుంచి ఒంటి గంటలోపు మధ్యాహ్న భోజనం చేయడం చాలా మంచిది. స్నాక్స్‌ సమయంలో ఫ్రూట్స్‌ లేదా జ్యూస్‌ తీసుకోవడం ఆరోగ్యకరం. రోజుకి ఒక యాపిల్‌ తింటే డాక్టర్‌ అవసరం లేదంటారు.

నిమ్మకాయ రసం అయితే శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. గ్రీన్‌ టీలోని యాంటీఆక్సిడెంట్స్‌ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి.

రోగనిరోధకశక్తి ఇనుమడింపచేస్తుంది. భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. నిద్రలేమికి లోనవకుండా నిద్ర విషయంలో సమయపాలన పాటిం చాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆరోగ్యవంతమైన మనిషికి రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/