గురువు ఎవరు?

ఆధ్యాత్మిక చింతన

Shirdi Sai
Shirdi Sai

గురువు ఎవరై ఉండాలి? అనే సమస్య ఎదురవు తూనే ఉంటుంది. సాయిబాబను బ్రాహ్మణుడని కొందరంటారు. సాయిబాబాకుగురువులు ఎవరు? అనే ప్రశ్నవస్తే సాయి బాబాయే అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడు కదా!

సాయిబాబాకు వేరే గురువు అవసరమా? అనే ప్రశ్నవస్తుంది. సాయి బాబా తన జీవిత కాలంలో గురువును విభిన్న కోణాలలో చూపారు. దీనిని బట్టి ఆధ్యాత్మిక రంగంలో గురువు ఆవశ్యకతను గూర్చి సాయి చెప్పారు.

అట్టిసాయిబాబా తనకు గురువు లేకుండా ఉన్నాడా? అనే ప్రశ్న రావచ్చును. సాయిబాబాకు గురువు ఉన్నాడు అని అంగీకరించిన పక్షంలో సాయిబాబాకు అనేక మందిని గురువుగా చెబుతారు. సాయి బాబాకు గోపాలరావ్‌ దేశముఖ్‌ గురువు అని కొందరు అంటారు.

కొందరు సాయిబాబాకు కబీరు గురువు అంటారు. సాయిబాబా ఒకటి రెండు సందర్భాలలో తన గురువు కబీరు అన్నాడు.

ఇంకా, మరికొన్ని సందర్భాలలో తానే కబీరునని పలుకుతాడుకూడా! అయితే సాయిబాబా కు గురువు కబీరుకాడా? హనుమంతుడు కూడా అద్వైతస్థితి తాను, రాముడు ఒకటే, అభిన్నలమని అంటారు. సాయికూడా ఆ ఆద్వైతభావనలో పలికి ఉండవచ్చునంటారు కొందరు.

సాయిబాబా హిందువు, కబీరు మహమ్మ దీయుడుగదా, ఎలా వారి గురుశిష్య బంధం పొసగుతుంది? అనే విషయం కూడా కొందరు లేవనెత్తుతారు. అసలు సాయిబాబాయే మహామ్మదీయుడని విశ్వసించేవారున్నారు.

సాయిబాబా భక్తులతో ముఖ్యుడు నానాసాహెబ్‌ చందోర్రరు. ఈతడు బ్రాహ్మణుడు, ధనికుడు, విద్యావంతుడు,

పట్టభద్రుడు వేదాంతశాస్త్రం, సంస్కృతము అతనికి ముఖ్యమైన, ఇష్టమైన బిభాగాలు. నానాసాహెబ్‌ తండ్రి ముస్లింలతో బందాలు పెట్టుకొని వలదని ఆ కుటుంబములోని వారందరను హెచ్చరించాడు. కాని నానా సాహెబ్‌ చందో ర్రరుకు షిరిడిలోని సాయిబాబాతో బంధమును తండ్రి అంగీకరించడని ఊహించాడు.

ఎందుకంటే, వేష భాషలలో సాయి రూపము మహమ్మ దీయులవలెనుండును కనుక. కాని, నానాసాహెబ్‌ తండ్రి తనకుమారుడు మహమ్మదీయసాధువును గురవుగా స్వీకరిం చుటకు అంగీకరించినాడు.

ఉపాసనీమహరాజ్‌ బ్రామ్మణుడు, సాయిని తన గురువుగా స్వీకరించాడు. సాయి శరణానందకూడ అంతే! మతమువే రైనను గురు శిష్య బంధము నకు అడ్డురాదు. భారత దేశములో మతపరముగా కాకున్నను,

కులపరముగ అట్టి పట్టింపు కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది. వేజండ్ల అప్పదాసుకు రామయోగిని గురువుగా స్వీకరిద్దామనే తలంపులో, రామయోగి తో ప్రస్తావనతెచ్చాడు. రామయోగి ‘నేను గొల్ల వాడను, నీవు బ్రాహ్మణుడవు.

నాగురుత్వము నీకు దగనిది. విప్రునకు దప్ప అన్యజాతికి ఉపదేశార్హతలేదని నీకు తెలియదా? అని ప్రశ్నిస్తాడు వేజేండ్ల అప్ప దాసును.అప్ప దాసు ‘ నాకు నా తండ్రి ప్రధాన గురువు.

మీకు క్షువునకు ఎందరైనను ఉపగురువు లుండ వచ్చునుగదా! అని సమాధాన మిచ్చాడు. ఇక రామయోగి ఆ యువకు డైన అప్పదాసు ఉత్సుకతనుగమనించి గురువయ్యాడు.

హిందువులు ఎందరో సూఫీ యోగులను గురువుగా స్వీకరించారు. గురుతత్వ మంతా ఒకటే!.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/