ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

నష్టపోయిన రైతులకు సాయం ఏదీ?:- ఎల్‌.ప్రఫుల్లచంద్ర, ధర్మవరం, అనంతపురం జిల్లా

నమ్ముకున్న పంట నట్టేట ముంచినది. రైతుల ఆశలు అడియా శలు అయ్యాయి. మన రాష్ట్రంలో అనేక చోట్ల కురిసిన భారీ వర్షాలకు ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా రైతులు చాలా నష్టపోయారు. గోదావరి వరద ముంపు ప్రాంతాలలో వేసిన పంటలు అన్నీ నేల పాలు అయ్యాయి.

పసుపు, వరి, కూరగా యలు,ఇతర వాణిజ్యపంటలు వరదనీటిలో మునిగిపోయా యి. గోదావరి వరద ముంపు ప్రాంతాలలో కోనసీమ తీర ప్రాంతాలు, లంక గ్రామాలు తదితర ప్రాంతాలలో దాదాపుగా 23వేలఎకరాలలో ఉద్వాన,వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా రైతులకు తీవ్రనష్టం వాటిల్లి కష్టాల్లో ముంచేసింది. ఇక ఈ రైతులకు తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలి. వారిని ఆదుకోవాలి.

ధరలు బాబో§్‌ు: -వీరుభొట్ల పేరయ్యశాస్త్రి, విజయవాడ

గడచిన కొన్ని నెలలుగా రాష్ట్రంలోకూరగాయలు, ఇతర నిత్యా వసరవస్తువ్ఞల ధరలు వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.

ముఖ్యంగా లాక్‌డౌన్‌ కాలంలో ఆ తర్వాత సరుకుల రవాణాకు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా కూడా వస్తువ్ఞల కొరత పేరుతో విపరీతంగా ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. రైతు బజార్లతో సహా అన్ని చోట్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

అసలే చిరుద్యోగులు, అల్పా దాయవర్గాలు,ఉన్న ఉద్యోగాలుపోయి ఉద్యోగాలున్నా జీతాలు, వేతనాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితు ల్లో కృత్రిమంగా ధరలు పెంచేస్తే ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదనిపిస్తుంది.

ప్రభుత్వం తలుచుకుంటే నిత్యా వసర వస్తువ్ఞల,కూరగాయల ధరలుసామాన్యులకు అందు బాటులోకి వస్తాయి. కనుక ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తక్షణం స్పందించి అక్రమార్కుల ఆగడాలను అరికట్టాలి.

ప్రభుత్వ ఐసోలేషన్‌లు ఏర్పాటు చేయాలి:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

రాష్ట్రంలోని గ్రామాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగు తున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో ప్రభుత్వఐసోలేషన్‌ సెంటర్ల ను వెంటనే ఏర్పాటుచేయాలి.

ఈసెంటర్లలో అన్ని వసతులను కల్పించడంతోపాటు సిబ్బంది, మందుల కిట్లు, డిస్పొజబుల్‌ పరికరాల కొరత లేకుండా చూడాలి.

వివిధ ఆస్పత్రులలో ఆక్సి జన్‌కొరత కారణంగా అనేకమరణాలు సంభవిస్తున్న నేపథ్యం లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ట్యాంకులను ఏర్పాటు చేయాలి.

పరువు హత్యలకు కళ్లెం వేయాలి: -పూసాల పద్మ, హైదరాబాద్‌

రాష్ట్రంలో వరుస పరువ్ఞ హత్యలు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉంది.చట్టాలను కఠినతరంచేసి కొరడా ఝుళి పించాలి.

ప్రేమ వివాహాలకు ముందు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్‌ చేయాల్సిన అవసరం ఉంది. ప్రణయ్ హత్య మరిచిపోకుండా ఈ తరహాలోనే హేమంత్‌ పరువు హత్య చోటు చేసుకోవడం పోలీసు వారికి ఛాలెంజ్‌ విసిరినారు.

నేర స్తులను పట్టుకోవడంలో రికార్డ్స్‌బద్దలు కొట్టినతెలంగాణ పోలీ సులు ఆత్మావలోకనం చేసుకోవాల్సినఅవసరం ఎంతైనా ఉంది.

పోలీసు స్టేషన్‌ పరిధిలో జల్లెడ పెట్టి కిరాయి గుండాలను కలుపు మొక్కల్లా ఏరి పారేయాలి. విష సంస్కృతికి మంగళం పాడాలి. అప్పుడే మహిళాలోకానికి శాంతి చేకూరుతుంది.

కొత్త చట్టాల ఊబిలో రైతన్న:-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత చుట్టుకుంది. నిరసనగా మిత్రపక్ష కేంద్ర మంత్రి రాజీనామాయే ఉదాహరణ.

దేశంలో ఎనభైశాతం మంది రైతు లు కేవలం రెండునుండి ఐదుఎకరాలు భూముల కలిగినటు వంటివారే.

వారు పండించే పంటలు దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవచ్చన్న నిర్ణయం ఎంత మంది పాటించగలరు. రైతుకు గిట్టుబాటుధరలేకుండా చేస్తున్నదళారీవ్యవస్థ నిర్మూ లించి ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేందుకు చట్టం చేయగ లిగితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది.

ఆంధ్ర ప్రదేశ్‌లో మోటార్లకు విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు రైతులను మరింత కుంగదీసేదే! కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కంటితుడుపు చర్యలు ప్రయోజనం చూపవ్ఞ. నూతన చట్టాల ఊబిలో రైతన్న దిగబడకుండా మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలి.

అవినీతిని నిరోధించాలి:- సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

తెలుగు రాష్ట్రాల్లో అవినీతి నిరోధకశాఖ దాడుల్లో పట్టుబడు తున్న అధికారుల అవినీతి బాగోతాలను చూస్తుంటే ఆందోళన కలుగుతోంది.

తక్కువస్థాయి ఉద్యోగాలు చేస్తున్న వందల కోట్ల లో ఆస్తులు పోగేస్తున్న వైనం చూస్తుంటే అవినీతి ఏస్థాయిలో వేళ్లునుకుందో ఇట్టే అర్థమవుతోంది.

కేసులు ఎక్కువ కాలం కోర్టుల్లోనడుస్తున్న కారణంగా పటిష్టమైన సాక్ష్యాధారాలతో వీలై నన్ని ఎక్కువ సెక్షన్‌లతో కేసులు నమోదు చేయని కారణంగా చిన్నపాటి శిక్షలతోఅవినీతి అధికారులు తప్పించుకుంటున్నారు. జిల్లాకొక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/telangana/