ఇంటింటా చిట్కాలు

మహిళలకు ప్రత్యేకం

Kitchen Tips
Kitchen Tips

పాలు మరిగించేటప్పుడు మీగడ ఎక్కు వగా మందంగా కట్టాలంటే పాలుకాచే గిన్నె మీద జల్లెడలాగా చిల్లులు ఉన్న మూతను ఉంచాలి.

దోసెలు బాగా రావాలంటే పెనంపై ఉల్లిపాయలతో రుద్ది దోసె వేయండి.

ఏదైనా వంటకం మాడిపోయి గిన్నెకు అంటుకపోతే వెంటనే గిన్నెను బోర్లించి చల్లని నీరు పోస్తే గిన్నెకు అంటుకుపోకుండా ఊడిపోతుంది.

ఖాళీ అయిన నెయ్యి లేదు నూనె ప్యాకెట్‌లో పప్పులు నిలువ చేస్తే ఎంతో కాలం నిలువ ఉంటాయి.

వాష్‌బేసిన్‌ రంధ్రాలో వాసన రాకుండా ఉండటానికి బేకింగ్‌ సోడా వేసి వేడి నీరు పోయాలి. అలా చేస్తే దుర్వాసన పోయి రంధ్రాలు కూడా శుభ్రపడతాయి. మిగిలిన వ్యర్థాలు కూడా తొలగిపోతాయి.

పసిపిల్లలకు అజీర్తి వ్యాధి కలగకుండా వారానికి మూడునాలుగు సార్లు ఓ స్పూన్‌ తేనెను తాగించాలి.

ఐస్‌లో పెట్టిన రొయ్యలు తాజాగా ఉండాలంటే వాటిని వెనిగర్‌ డ్రైవైన్‌ల మిశ్రమంలో ఉంచాలి.

మైనం కరిగించి మెత్తగా ఉన్నప్పుడే, అరి కాళ్ల పగుళ్లకు పట్టిస్తే అది త్వరగా తగ్గుతుంది.

పసిపిల్లలకు జలుబు, దగ్గు తరచుగా రాకుండా ఉండాలంటే జాజికాయ అప్పుడప్పుడు అరగదీసి పిల్లలచేత కొద్ది కొద్దిగా నాకిస్తూ ఉండాలి.

ఖాళీ షాంపు ప్యాకెట్సు సబ్బు నీళ్లల్లో వేసి బట్టలు నానవేస్తే బట్టలు మంచి వాసన వేస్తూంటాయి.

పట్టు చీరలకు ఫాల్స్‌ కుట్టితే అంచులు నలిగి పోయి ముడతలు పడకుండా ఉంటాయి.

బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు చల్లని నీటిని బట్టలపై చిలకరించడం అందరూ చేసేపని చల్లనినీటికి బదులుగా గోరువెచ్చని నీటిని వాడితే మీ ఇస్త్రీ కార్యక్రమం త్వరగా అయిపోతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/