శకుంతల

ఆధ్యాత్మిక చింతన

Shakuntala
Shakuntala

రాజర్షియైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలనే ఆకాంక్షతో ఘోర తపస్సుకు పూనుకొనగా, ఇండ్రుడు తన పదవిపోతుందనే భయంతో తనవద్ద నున్న అప్సరసలతో ఒకరైన మేనకను విశ్వామిత్ర తపోభంగనిమిత్తం ఆమెను అడవ్ఞలకు పంపాడు.

ఆమె ఆకర్షణకు లోనై ముని విశ్వామిత్రుడు మేనకను వరించగా, వారిరువురకు జన్మించిన పుత్రికయే శకుంతల. తమ తప్పును తెలుసుకున్న విశ్వామిత్రడు మేనకలకు పుట్టిన పాపను అడవ్ఞలలో వదిలేసి, వారి లక్ష్యాలకై వెళ్లిపోగా శాకుంతలములు అనబడే పక్షులచే పెంబడి శకుంతలగా పేరొంది.

ఆ తర్వాత అడవులలో తాపసియైన కణ్వమహాముని ఆశ్రమంలో ఆశ్రయం పొంది, ఆయన ప్రాపుతో పెరిగి పెద్దదయిన లావణ్యవతి.

దేవకాంత శకుంతల వనాలలో కాలం గడపసాగింది. ఈ తరుణంలో వేటనిమిత్తం చంద్రవంశ క్షత్రియుడైన దుష్యంతుడు వేటకై వచ్చి అక్కడే అడవులలో ఉండే శకుంతలను చూచి ఆమె అతిలోక సౌందర్యానికి అబ్బురపడి కణ్యుడి పెంపుడు కూతురైన, క్షత్రియదేవకన్యగా ఆమెను గ్రహించి, గాంధర్వ వివాహం చేసుకున్నాడు.


పిమ్మట తాను మరల వచ్చి ఆమెను తన సతిగా, రాజ్యానికి ఆహ్వానం పలుకుతానని చెప్పి, దుష్యంతుడు వెళ్లి కాలక్రమంలో శకుంతలను మరచిపోగా గర్భవతియైన ఆమెను కణ్వుడు తన శిష్యులతో దుష్యంతుడు వద్దకు పంపగా ఆమె ఎవరో తనకు తెలియదని చెప్పడం.

దుర్భరబాధతో వెనుతిరిగిన శకుంతలకు భరతుడనే పుత్రుడు కలిగి అడవులలో చరించినా, అఃలభారత సామ్రాజ్యాధిచక్రవర్తిగా రూపొందగా, పరిపాలించగా మొదట సర్వదమనుడనే పేరుతో పెరిగినా భరతఖండానికే రాజుగా చిరయశస్సుతో శోభించాడు.

ఎంత ఆసక్తికర మమాభారత గాధకే మకుటాయమానంగా, శకుంతలాదుష్యంతుల గాధ వినుతికెక్కి, భరతుడి పరిపాలనతో భారతభూమి పునీతమైంది.

శకుంతలా దుష్యంతుల అశరీరవాణి ఆశీర్వాదంతో తిరిగి పుణ్యదంపతులుగా భరతపుత్రునితో కలిసి జీవించారు.

శకుంతలోపాఖ్యానంలో చెప్పుకోదగ్గ అంశం అడవ్ఞలలో తాపసిగా, సర్వసంగపరిత్యాగిగా యోగి అయిన కణ్వుడు తన పెంపుడు కూతురుగా పెరిగిన శకుంతలను దుష్యంతునివద్దకు పంపేటప్పుడు కంటనీరు పెట్టుకుని దూషించటం..

ఎంతో ఆసక్తికరంగా శకుంతల, కణ్వుల అనుబంధం మహాభారత కధలో ఆకట్టుకుంటుంది.

విశ్వమిత్రుడు మేనకల వంటి వారి సంతానమైన శకుంతల సామాన్య యువతిగా ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొన్న తీరు ఎంతవారికైనా కర్మానుభవాలు తప్పవు అనేలా ఆమె జీవితం ఉంది.

  • యం.వి.రమణకుమారి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/