య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాలు మూసివేత‌

డెహ్రాడూన్‌: శీతాకాలం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం ఉత్త‌రాఖండ్‌లోని హిమాల‌యాల్లో ఉన్న య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాల‌ను మూసివేశారు. ఉద‌యం 8 గంట‌ల‌కు కేదార్‌నాథ్‌, య‌మునోత్రి, గంగోత్రి ఆల‌యాల ద్వారాల‌ను మూశారు. మ‌ళ్లీ ఆర్నెళ్ల త‌ర్వాత చార్‌థామ్ యాత్ర‌కు సంబంధించిన ఆల‌యాలు తెరుచుకుంటాయి. ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం ఆల‌య త‌ల‌పుల‌ను పూజ‌రులు వేశారు. నిజానికి ఈ ఏడాది కేవ‌లం కొన్ని రోజులు మాత్ర‌మే ఆల‌యాల‌ను తెరిచారు. క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో చార్‌థామ్ యాత్ర‌కు మొద‌ట‌ల్లో అనుమ‌తి ఇవ్వ‌లేదు.

కాగా, శుక్ర‌వారం ప్ర‌ధాని మోడీ కేదార్‌నాథ్‌లో ప‌ర్య‌టించిన విషయం తెలిసిందే. అక్క‌డ ఆయ‌న జ‌గ‌ద్గురు ఆదిశంక‌రాచార్యుల విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/