అలసిన కళ్లకు ఇలా ఉపశమనం !

వ్యాయామం- ఆరోగ్యం

Eye Exercises
Eye Exercises

బయటకు వెళ్లే వీలు లేక , ఇంట్లోనే కూర్చుని డిజిటల్ తెరలు చూసి చూసి కళ్లు బాగా అలసిపోయి ఉంటాయి అలాంటి అలసిన నేత్రాలకు ఈ వ్యాయామం తో ఉపశమనం కలుగుతుంది.. ఆలస్యమెందుకు .. ఇక మొదలు పెట్టండి..

బ్లింక్ స్లో:

కుర్చీలో కూర్చొని,, మీద, తలా నిటారుగా పెట్టండి… భుజాలు , రిలాక్స్డ్ మోడ్ లో ఉంచాలి.. ఎదురుగా ఉన్న ఖాళీ గోడను చూడండి.. ఓ క్షణం కళ్లు మూసి తెరవండి… ఇలా పది లె!క్కన రోజుకు రెండుసార్లు చేయాలి..

Eye Exercises

నలు దిక్కులా:

నిటారుగా కూర్చొని.. భుజాలను రిలాక్స్డ్ గా ఉంచండి.. మెడ , తలా కదిలించకుండా కనుబొమ్మలు కుడి వైపు తిప్పండి.. నిదానంగా సీలింగ్ వైపు, ఎడమ వైపు, కిందకు కదిలించండి.. ఇలాగే వ్యతిరేక దిశలో కూడా చేయండి.. ఇలా పది సెకన్ల చొప్పున రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది..

ఫోకస్ చేంజ్:

కుడి చేతి నాలుగు వేళ్లనూ మూసి, చూపుడు వేలిని మీ కళ్లకు పది అంగుళాల దూరంలో ఉంచండి.. ఆ వేలుపైనే పూర్తి దృష్టి పెట్టండి… నెమ్మదిగా, వేలిని పక్కకు కదిలించండి.. కానీ, చూపు మారే కూడదు. అదే డైరక్షన్ లో దూరంగా ఉన్న ఏదో ఒక వస్తువుపై దృష్టి పెట్టండి.. ఇపుడు మళ్లీ చూపుడు వేలుపై దృష్టి మరల్చండి.. నిదానంగా వేలిని కళ్ల దగ్గరకు తీసుకు వెళ్ళండి.. మరలా దూరంగా ఉన్న వస్తువు ను చూడండి.. ఇలా మూడు సార్లు చేయాలి..

‘స్వస్థ ‘ (ఆరోగ్య విషయాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/