హరిహర వీరమల్లు మేకింగ్ వీడియో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడో మొదలుపెట్టుకోగా మధ్యలో కరోనా రావడం, ఆ తర్వాత పవన్ రీమేక్ చిత్రాలను పూర్తి చేయడం తో ఈ సినిమా అలాగే ఉండిపోయింది. తాజాగా నిన్న రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ మొదలుపెట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలతో ఈ షెడ్యూలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ షూటింగ్ తాలూకా సన్నివేశాలను చిత్ర యూనిట్ ప్రీ షూట్ సెషన్ వీడియోను పేరిట విడుదల చేసింది. ఈ వీడియో లో పవన్ పోరాట సన్నివేశాలను చూపించారు.

ఈ వీడియో చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తీ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి కథతో క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏఎం రత్నం సమర్పణలో ఏ.దయాకర్ రావు నిర్మాతగా మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

YouTube video