గ్రీన్‌ టీ వారానికి మూడు సార్లు!

Green Tea

వారానికి మూడు సార్లు గ్రీన్‌ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ట్రోక్‌ ముప్పులను నివారించవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేశారు. గ్రీన్‌ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తేల్చారు. ఒక అధ్యయనంలో గ్రీన్‌ టీ తాగేవారు తాగని వారితో పోలిస్తే సగటున 1.26 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతికినట్లు గుర్తించారు. బ్లాక్‌ టీ తాగిన వారిలో ఇలాంటి ప్రయోజనాలను గుర్తించలేదని పరిశోధకులు అన్నారు. కేవలం మంచి ఆరోగ్యం కోసం మాత్రమే గ్రీన్‌ టీ ఎంచుకోవడం కాదు. అనారోగ్య అలవాట్లను కొనసాగిస్తూ గ్రీన్‌ టీ తాగినంత మాత్రాన మెరుగైన ఫలితాలు ఉండవని తెలుసుకోవాలి. టీలో ఉండే పోలీపెనాల్స్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణం కలిగి ఉందన్నారు. పండ్లు, కూరగాయల్లో కూడా లభించే పాలీపెనాల్స్‌ దెబ్బతిన్న కణ జాలాన్ని శక్తివంతం చేయడంతో పాటు శరీరంలో షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రిస్తూ బరువు పెరగడాన్ని నెమ్మదింపచేస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/