కొనసాగుతున్న లోక్‌సభ ఓట్ల లెక్కింపు..258 స్థానాల్లో ఎన్‌డీఏ ఆధిక్యం

Counting of Lok Sabha votes in progress.. NDA lead in 258 seats

న్యూఢిల్లీః లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మ‌రోసారి ఎన్‌డీఏ హ‌వా కొన‌సాగుతోంది. దేశవ్యాప్తంగా 258 స్థానాల్లో ఎన్‌డీఏ ఆధిక్యంలో ఉంది. అటు ఇండియా కూటమి 166 చోట్ల ముందంజ‌లో ఉంది. మరో 17 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో కొనాగుతున్నారు. ఇక‌ యూపీలోని వారణాసిలో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న‌ ప్రధాని మోడీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అలాగే వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్‌ గాంధీ ముందంజ‌లో ఉంటే.. అమేథీలో మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో నితిన్‌ గడ్కరీ ఆధిక్యంలో ఉన్నారు. రాజస్థాన్‌ కోటాలో స్పీకర్‌ ఓం బిర్లా, మధ్యప్రదేశ్‌లోని గుణలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌, హమీర్‌పుర్‌లో అనురాగ్‌ ఠాకూర్‌, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌, విదిశాలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కర్ణాటకలోని మాండ్యలో కుమారస్వామి, మహారాష్ట్రలోని బారామతిలో సుప్రియా సూలే ముందంజ‌లో ఉన్నారు.