స్టీల్ ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత సీఎం కి ఉంది

చంద్రబాబు ట్వీట్

Chandra Babu tweets to CM Jagan
Chandra Babu tweets to CM Jagan

Amarvati: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డికి ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీని ఢీకొడ‌తా, మోడీ మెడ‌లు వంచుతాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికే జ‌గ‌న్‌రెడ్డీ.. నీ క్విడ్‌ప్రోకో దోపిడీ బుద్ధిని ప‌క్క‌న‌ పెట్టు’’ అంటూ ట్విట్ లు చేశారు. 

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వ‌త‌ హక్కు. దీనిని ప్రైవేట్ ప‌రం చేయాల‌ని చూస్తే మ‌రో ఉక్కు ఉద్య‌మం త‌ప్ప‌దు. లక్ష‌లాది మంది ఏళ్ల త‌ర‌బ‌డి ఉద్యమించి, 32 మంది ప్రాణ‌త్యాగంతో, అమ‌రావ‌తివాసి అమృత‌రావు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌తో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని సాధించుకున్నాం. అటువంటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని జ‌నాన్ని ఏమార్చి, తుక్కు కింద కొనేసి ల‌క్ష‌ల కోట్లు కొట్టేద్దామ‌నుకుంటున్న జ‌గ‌న్‌రెడ్డి గ్యాంగ్‌ కుతంత్రాన్ని ప్ర‌జ‌ల ‌మ‌ద్ద‌తుతో అడ్డుకుని తీరుతాం అంటూ ట్విట్ చేశారు.

అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కే విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని అన్న జగన్మోహన్ రెడ్డీ.. ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పించే విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేస్తుంటే, ఒక ముఖ్య‌మంత్రిగా నీ బాధ్య‌త ఏంటి? నీ 31 కేసుల మాఫీ కోసం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌స‌భ, 6గురు రాజ్య‌స‌భ‌ స‌భ్యుల్ని కేంద్రానికి తాక‌ట్టు పెట్టేశావు. ప్ర‌త్యేక‌హోదాని బాబాయ్ హ‌త్య‌కేసుకి మార్టిగేజ్ చేశావు’ అంటూ ట్విట్ చేశారు.

గతంలో దివంగతవాజ్‌పాయి ప్రభుత్వంలో ఇదే పరిస్థితి వస్తే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడింది.. అప్పుడు అధికారంలో ఉన్న‌ తెలుగుదేశం ప్ర‌భుత్వం. ఆ పని ఇప్పుడు మీరెందుకు చేయరు?’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.