విశాఖలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. పోలీసులు ఆంక్షలు

pawan-kalyan

విశాఖ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మొదట నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలని సూచించారు. విమానాశ్రయం నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని తెలిపారు. ఎక్కడా రోడ్‌షో నిర్వహించొద్దని, బయటికొచ్చి అభివాదాలు కూడా చేయొద్దన్నారు. కాగా, ఇవాళ పవన్‌ విశాఖకు రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా బస చేసే హోటల్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు జగదాంబ జంక్షన్‌లో వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు.