జై కోటక్​ అదితిని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ రామ్ హీరోయిన్

కళ్యాణ్ రామ్ సరసన ఇజం మూవీ లో నటించిన అదితి ఆర్య..తాజాగా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. 2015 ఫెమినా మిస్​ ఇండియా టైటిల్​ని గెలుచుకున్న అదితి.. బాలీవుడ్​ లో పలు సినిమాల్లోనూ నటించింది. 2016లో వచ్చిన కళ్యాణ్​రామ్ ఇజం.. సెవెన్, నిన్ను వదిలి నేను పోలేనులే వంటి తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది.

తాజాగా కోటక్​ మహీంద్రా సంస్థల అధినేత ఉదయ్​ కోటక్​ కుమారుడు జై కోటక్..​ అదితిని పెళ్లి చేసుకుంటున్నట్టుగా అధికారిక ప్రకటన ప్రకటించాడు. ‘అదితి నాకు కాబోయే భార్య.. ఈ రోజు యేల్​ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. నాకు చాలా గర్వంగా ఉంది’ అంటూ ఆమె గ్రాడ్యేయేషన్​ డే ఫొటోలను పోస్ట్​ చేశాడు. జై ప్రస్తుతం కోటక్​ 811 కి వైస్​ ప్రెసిడెంట్​గా ఉన్నాడు. ఈ ట్వీట్​ పై పలువురు ప్రముఖులు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.