మంగ‌ళ‌గిరిలో లోకేశ్, పీఠాపురంలో ప‌వ‌న్‌ ముందంజ

Lokesh in Mangalagiri and Pawan in Peethapuram

అమరావతిః ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. అటు రాష్ట్రంవ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన పీఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేనాని ముందంజ‌లో ఉన్నారు. 4వేల‌కు పైగా ఓట్ల‌తో లీడ్‌తో ప‌వ‌న్ దూసుకుపోతున్నారు. వైసీసీ అభ్య‌ర్థి వంగా గీత వెనుకంజ‌లో ఉన్నారు. టీడీపీ 12, జ‌న‌సేన 3 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో లీడ్‌లో ఉన్నాయి. అలాగే తెనాలిలో జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.