వార‌ణాసిలో ప్ర‌ధాని మోడీ వెనుకంజ‌

Prime Minister Modi lags behind in Varanasi

న్యూఢిల్లీః ప్ర‌ధాని మోడీ వెనుకంజ‌లో ఉన్నారు. వార‌ణాసి నుంచి ఆయ‌న లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం కాంగ్రెస్ అభ్య‌ర్థి అజ‌య్ రాయ్ .. ముందంజ‌లో ఉన్నారు. 11480 ఓట్ల తేడాతో అజ‌య్ రాయ్ లీడింగ్‌లో ఉన్నారు. రెండో స్థానంలో ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోదీ ఉన్నారు. ఎన్నిక‌ల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఆయ‌న‌కు 5257 ఓట్లు పోల‌య్యాయి.

దేశ‌వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది. ఎన్డీఏ కూట‌మి 290 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ది. ఇండియా కూట‌మి 212 స్థానాల్లో దూసుకెళ్తున్న‌ది. దీంతో ఈ సారి పోరు హోరాహోరీగా క‌నిపిస్తున్న‌ది. తాజా ట్రెండింగ్ ప్ర‌కారం.. ఎన్డీఏ కూట‌మి మ్యాజిక్ మార్క్‌ను దాటినా.. కాంగ్రెస్ కూట‌మి కూడా ఎక్కువ స్థానాల‌నే గెలుచుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.