చిన్నారులు చురుకుగా ఉండేందుకు..

పిల్లలు, పోషణ, సంరక్షణ

8 సంవత్సరాల పాప ఎన్నిసార్లు పాఠాలను వల్లించినా మరుసటి రోజుకే మర్చిపోతుంది.. ఇటువంటి చిన్నారులకు పోషక విలువలున్న ఆహారం , మైండ్ గేమ్స్ తో జ్ఞాపకశక్తిని మెరుగుపర్చవచ్చు అని వైద్యనిపుణులు అంటున్నారు..

Adults should allocate time for children

మెదడు చురుకుదనానికి కొవ్వు అత్యంత ముఖ్యం.. రోజూ ఆహారంలో రెండు లేదా మూడు చెంచాల ఆవునెయ్యిని చేరిస్తే చిన్నారుల మెదడు బాగా పనిచేసి జ్ఞాపకశక్తి, తెలివితేటలూ పెరుగుతాయి.. కొబ్బరిని ఆహారంలో చేరిస్తే మంచి ఫలితం ఉంటుంది.. శరీరం డిహైడ్రేట్ కాకుండా మంచి నీటిని ఎక్కువ తాగటం అలవారిస్తే మెదడు పరితీరు మెరుగుపడుతుంది

అవిసె గింజలు:

ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవిసేలా ఉపయోగమెంతో ఉంది.వీటిలోని యాంటీ ఆక్సీడెంట్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.. మతిమరుపును దూరం చేసి, మెదడును చురుకుగా మారుస్తాయి.. సలాడ్స్ రూపంలో వీటిని పిల్లలకు రోజూ అందిస్తే మంచిది.. అలాగే పసుపు మెదడు కనాలజీ పలు రకాల ప్రయోజనాలను కల్గిస్తుంది.

విటమిన్లు :

విటమిన్ డి, బి 12 ఉండే చేప, పాల ఉత్పత్తులు, గుడ్లు, పుట్ట గొడుగులు, చికెన్ వంటి వాటిని ఆహారంలో ఉండేలా చూస్తే, పిల్లలకు జ్ఞాపక శక్తి , మెదడును ఉత్సాహంగా ఉంచుతాయి.. పిల్లల శరీరానికి కనీసం పావు గంటైనా ఉదయపు వేళ ఎండ తగలాలి.. రోజుకి రెండు గంటలైనా ఆరుబయట ఆడేలా చూడాలి.. ఇది వారికి వ్యాయామంగా మారి , మెదడుకు ఆక్సిజన్ అందిస్తుంది.. పనితీరు బాగుంటుంది..

మైండ్ గేమ్స్:

ఒకే రకమైన బొమ్మలను జత చేయించటం , పజిల్స్ ను పూర్తి చేయించటం, బోర్డు గేమ్స్, వర్డ్ గేమ్స్ వంటివి పిల్లల మెదడును చురుకుగా ఉండేలా చేస్తాయి.. జ్ఞాపక శక్తి, వేగంగా ఆలోచించటం వంటివన్నీ అలవడతాయి.. ఇవే కాకుండా రక రకాల కథలను చదివి వినిపిస్తూ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలి.. కథల్లోని పాత్రలను అపుడప్పుడు అడుగుతూ ఉంటె మతిమరుపు దూరమవుతుంది.. అలాగే పాఠ్యాంశాలను చదివిన వెంటనే చూడకుండా రాయించటంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

‘ఆధ్యాత్మికం’ వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/devotional/