మనుషులు.. మనీషులు

ఒకడు మానవుడుగా పుడతాడు, మానవుడిగా పెరిగి ఘోర పాపకృత్యాలు చేసి మహాపాపిగా చచ్చి క్రిమికీటకాదులుగనో, పశు పక్ష్యాదులుగనో జన్మించి పాప ఫలాన్ని అనుభవించి మరీ మనిషి జన్మ ఎత్తుతాడు. అంటే క్రింది స్థాయికి పోయి మరీ సాధారణ స్థాయికి చేరుకొంటాడు. మరొకడు మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి కొన్ని మంచి కార్యాలు చేసి పుణ్యవంతుడై చచ్చి, స్వర్గాదిలోకాలకు వెళ్లి పుణ్యఫలాన్ని అనుభవించి మళ్లీ మనిషిగా జన్మిస్తాడు.

క్షీణేపుణ్యేమర్త్యలోకం విశంతి అంటుంది భగవద్గీత. అంటే పై స్థాయికి వెళ్లి కర్మ ఫలాన్ని అనుభవించి మరీ తన సాధారణ స్థానానికి చేరుకొంటాడు. మరొకడు మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి ఏదో కొంత పాపము, కొంత పుణ్యము చేసి, మరణించి తన పాప, పుణ్య ఫలాలను అనుభవించటానికి మరీ మనిషిగా పుడతాడు. అంటే తన సాధారణ స్థాయి నుంచి పైకి పోక, క్రిందికీ పోక ఎక్కడుంటే అక్కడే ఉన్నవాడవ్ఞతాడు.

సాధారణంగా ప్రపంచంలోని జీవ్ఞల కథ అంతా ఇదే. ఒకేచోట పడి ఉన్న గుండులాగానో, దొర్లుతూ పైకి పోయి మరీ క్రిందికి వస్తున్న గుండులాగానో దొర్లుతూ పైకి పోయి మరి క్రిందికి వస్తున్న గుండులాగానో ఉంటుంది. ఈ వ్యవహారమంతా ఎక్కడ ఆకలి దప్పులు, కష్టసుఖాలు, జీవన్మరణాలు, చీకటి వెలుగులు ఉంటాయో అక్కడే మరీ మరీ తిరగాల్సి ఉంటుంది.

మనిషికి వేరే మార్గం లేదా? ఉంది అంటుంది భగవద్గీత. అత్యంత శ్రద్ధగా పఠిస్తే ఒక్క శ్లోకము చాలు ఆ మార్గాన్ని పట్టుకోవటానికి రెండం అధ్యాయంలోని 5వ శ్లోకము ఇది ‘కర్మజం బుద్ధి యుక్తా హి ఫలం త్యక్త్వా మనిషిణః!
జన్మ బన్ధ వినిర్ముక్తా! పదం గచ్ఛన్త్యనామయమ్‌!!
దీని అర్ధము సమత్వ బుద్ధి గల వివేకులు కర్మల వల్ల కలిగే ఫలాన్ని వదలి జన్మ బంధం నుండి విముక్తులై దుఃఖరహితమైన మోక్ష పదాన్ని పొందుతారు.
ఈ శ్ల్లోకానికి శంకరాచార్యులవారి భాష్యాన్ని మనం తెలుసుకోవాలి. కర్మల వల్ల కలిగే ఫలం ఇష్ట అనిష్ట దేహ ప్రాప్తి. బుద్ధి యుక్తులు అంటే సమత్వ బుద్ధి గలవారు ఫలాన్ని వదలివేసి మనీషులై అంటే జ్ఞానులై, జీవించి ఉండగానే జన్మబంధం నుండి విముక్తులై దుఃఖరహితమైన మోక్షమనే పరమ విష్ణుపదం చేరుకుంటారు. చూడండి మనిషిగా జన్మించిన వాడు మనిషిగనే పెరిగి మనిషిగానే మరణించరాదని తెలుస్తుంది. మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి, మనీషిగా మారి అంటే జ్ఞానియై, వివేకవంతుడై జనన మరణ చక్రం నుండి విడివడి సచ్చిదానందుడు కావాలి. దేహం ఉండవలసినంత సేపు ఉండి పడిపోతుంది.మనుషులు మనీషులై పోవాలి

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/