పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు

అవినీతి బుర‌ద‌ను క‌డుక్కోవాలంటే ఈ రాజీనామాలు స‌రిపోవు ..య‌న‌మ‌ల‌

అమరావతి : టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఏపీ ప్రభుత్వం పై మండిప‌డ్డారు. పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు వైస్సార్సీపీ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంద‌ని అన్నారు. అందుకే కీలుబొమ్మ మంత్రి వ‌ర్గాన్ని బ‌లి ప‌శువును చేస్తున్న‌ట్లు కనిపిస్తోంద‌ని చెప్పారు.

మంత్రుల నుంచి సీఎం జ‌గ‌న్ ఎందుకు రాజీనామాలు కోరారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అవినీతి బుర‌ద‌ను క‌డుక్కోవాలంటే ఈ రాజీనామాలు స‌రిపోవని ఆయన అన్నారు. విధ్వంస‌క విధానాలు పాటిస్తోన్న జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి ప‌ద‌వి నుంచి దిగిపోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/