చిన్నారుల్లో ఒత్తిడి రానీయొద్దు

చిన్న చిన్న ప్రశంసలే వారు ముందడుగు వేయటానికి దోహదం

తోబుట్టువులతోనూ కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే పిల్లలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలకు ఏం ఒత్తిలుంటాయి అనుకోకుండా ఆ ఆలోఛానళ్ల నుంచి వాళ్ళను బయటకు తీసుకురాక పొతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని అంటున్నారు.

stress in children

చిన్నారుల ప్రవర్తనలో మార్పును తల్లిదండ్రులు గుర్తించాలి. కారణాలను కనిపెట్టాలి. ఇంటి వాతావరణం , చదువులు, స్నేహితుల ప్రభావం వంటి పలు అంశాలు పిల్లల్లో ఒత్తిడికి దారి తీస్తాయి. . వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే , వారి మనసులు అర్ధం చేసుకోవచ్చు. వారి మనసులోని ఒత్తిడిని బయట పెట్టటానికి తగిన వాతావరణం కల్పించాలి. కోపాన్ని ప్రదర్శించకుండా చిన్నారులతో మృదువుగ మాట్లాడాలి. అపుడే పిల్లలు వారి మనసులోని మాటలను ధైర్యంగా చెప్పగలుగుతారు. ఒత్తిడికి కారణాన్ని త్వరగా గుర్తించి దూరం చేయటానికి ప్రయత్నిస్తే చాలు.

parents should spend some time with their children

ఉత్సాహం నింపేలా….

చదువు విషయంలో ఒత్తిడికి గురి అవుతుంటే వారికి ధైర్యం చెప్పాలి. తెలియని పాఠాలను విడమర్చి చెప్పటం, చిన్న చిన్న టాస్క్ ల రూపంలో పాఠ్యాంశాలను తేలికగా అర్ధంమయ్యేలా చెప్పటం, వారిలో ఉత్సహాయం నింపటం ద్వారా భయాన్ని మటుమాయం చేయొచ్చు. అపుడు వల్లే రాణిస్తారు . మార్కులను కొలమానంగా చూడొద్దు ఇతర పిల్లలతో పోల్చొద్దు. అమ్మ, నాన్నలు ఇచ్చే చిన్న చిన్న ప్రశంసలే చిన్నారులను మరో అడుగు ముందుకు వేసేలా ప్రోత్సహిస్తాయి.

సమయాన్ని కేటాయిస్తూ…

ఫోన్, టీవీకి అతుక్కు పోకుండా ఉండాలంటే.. చదువుతోపాటు ఆటలకూ కొంత సమయాన్ని కేటాయించాలి. ఇలా దేనికి దానికి సమయం కేటాయించటం, దాన్ని అమలు చేయటం నేర్పించాలి. ఇందులో ఆసక్తి చూపించక పోయినా, వారి కోసం పెద్ద వాళ్ళు అవుట్ డోర్ గేమ్స్ ఆడటానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులు ఉత్సాహంగా మైదానంలో ఆడుకుంటే క్రమేపీ చిన్నారుల్లోనూ మార్పు కన్పిస్తుంది. అంతే కాదు , తోటి పిల్లలతో కలిసి , ఆదుకునే వాతావరణాన్ని కల్పిస్తే చాలు .. పిల్లల్లో శారీరక, మానసికారోగ్యం పెంపొందుతుంది. ఇది వారిని ఒత్తిడి నుంచి దూరం చేసి నిత్యం ఉత్సాహవంతులుగా ఉండేలా చేస్తుంది.

స్వస్థ (ఆరోగ్యం విషయాలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health/