ఇలా చెబితే వింటారు..

పిల్లల అలవాట్లు- సంరక్షణ- పెద్దల పాత్ర

Tell them to understand anything-The role of adults with children
Tell them to understand anything-The role of adults with children

పిల్లలు మన మాట వింటున్నట్టే వుంటారు.. కానీ, వినరు. వాళ్లు చేయాలన్నదే చేస్తారు.. కారణం, మనం వాళ్లకు చెప్పాల్సిన విధంగా చెప్పటం లేదు కాబట్టి. పిల్లల ముందు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వొద్దు.. ఏం చెప్పినా సూటిగా, సుత్తి లేకుండా చెప్పండి… . అదే వాళ్ళకు అర్ధం అవుతుంది.. మీరు సుదీర్ఘంగా చెప్పే మాటలను వాళ్లు ఏ మాత్రం బుర్రకెక్కించుకోరు సరికదా.. ‘ అమ్మ ఏం చెప్పినా ఇంతే బోర్ అనుకుంటారు..

‘చిన్నీ అది చెయ్యకు’., బుజ్జీ ఇలా చేయొద్దు’, ఇలా మాట్లాడటం మానేయండి.. పిల్లలకు చెప్పేటప్పుడు ‘ ఇది చెయ్యి’, ‘ ఇలా చెయ్యి’. ఇలాంటి సానుకూల పడాలనే వాడాలి… అపుడే పిల్లలతో మీరు అనుకున్న పనులు చేయించగలరు…

గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేది పెద్దవాళ్ళ విషయంలోనే కాదు.. పిల్లల విషయంలోనూ వర్తిస్తుంది… మీరు చెప్పింది వాళ్లు వినాలని మీరు కోరుకున్నట్టే.. వాళ్లు కూడా తాము చెప్పేది అమ్మా నాన్నలు వినాలనుకుంటారు.. కాబట్టి, వాళ్లు చెప్పేది మనసు పెట్టి వినండి..

‘హోమ్ వర్క్ చెయ్ ‘, ‘అన్నం తిను ‘ ఇలా పిల్లలకి ఎప్పుడూ హుకుంలు జారీ చేయకండి.. అదే మాటని ఇలా చెప్పి చూడండి… ‘ హోమ్ వర్క్ ఇపుడు చేస్తావా? .. కాసేపు అయ్యాక చేస్తావా? ..ఇలా రెండు ఆప్షన్స్ ఇస్తే ఏదో ఒకటి ఎంచుకుంటారు… రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నందుకూ, సొంతంగా నిర్ణయం తీసుకున్నందుకు పిల్లలు సంతోష పడతారు…

‘ఆధ్యాత్మికం’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/