పండ్లు, కూరగాయలు తాజాగా..

ఇంట్లో చిట్కాలు

Fresh fruits and vegetables

కరోనా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మహమ్మారిగా ప్రకటించింది. దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

నిర్దేశించి సమయంలోనే సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఒకేసారి ఎక్కువ సరుకులు తెచ్చుకుంటే వాటిలో కొన్ని పాడడయ్యే అవకాశం ఉంటుంది.

పండ్లు, కూరగాయలను నిలువ చేసినప్పటికీ, అవి పాతవి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయలు జీవితం పెంచడానికి కొన్ని పద్ధతులు పాటిస్తే మంచిది.

మార్కెట్‌ నుండి తెచ్చి పండ్లు, కూరగాయలను సరిగ్గా కడిగి తేమ లేకుండా చూసి వాటిని ఉత్పత్తి సంచులలో ఉంచాలి.

మూసివేసిన సంచులలో ఉంచితే త్వరగా పాడయిపోవడం, కుళ్లిపోవడం జరుగుతుంది. ఆపిల్‌, బంగాళా దుంపలను నిలువ చేయడం కష్టం. ఎందుకంటే ఆపిల్‌ ఇథలీన్‌ వాయువును విడుదల చేస్తుంది.

ఇది బంగాళాదుంపల జీవితాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఆపిల్స్‌,ఆప్రికాట్లు, ఇతర పండ్తలో సలాడ్లు చేస్తే వాటి నుండి కూడా ఇథలీన్‌ వాయువు విడుదల అవుతుంది.

కాబట్టి వాటిని ఉపయోగించిన తరువాత వాటిని ఫ్రిజ్‌లో ఉంచాలి. అవకాడో, పీచెస్‌, బేరి బయట ఉంచవచ్చు. అవి పూర్తిగా పండి తర్వాత వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి.

అలాగే అన్నింటినీ కలపకుండా ప్రత్యేక బుట్టలో పెట్టాలి. కరోనా మహమ్మారి సమయంలో పండ్లు, కూరగాయలను కడగడం బాగా సిఫార్సు చేయబడినప్పటికీ వాటిని ఫ్రిజ్‌లో ఉంచే ముందు వాటిని బాగా ఆరబెట్టాలి.

ద్రాక్ష పండ్లను బాగా కడిగి ఎండబెట్ట తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎండిన ద్రాక్షను కాగితపు టవల్‌ మీద ఉంచి ఫ్రిజ్‌లో ఉంచాలి. పుట్టగొడుగులను సీలు చేసి కంటైనర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి.

అరటి పండ్లను బంచ్‌ నుండి వేరు చేసి నిలువ చేయాలి.

ఇలా చేయడం వల్ల తొందరగా పండిపోవు. ఇక స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్‌లను వేడి నీటితో కడగి తడి ఆరిపోయాక ఫ్రిజ్‌లో పెట్టాలి. టమోటాలను ఫ్రిజ్‌లో పెట్టవద్దు.

ఎందుకంటే ఇవి రుచి మారడమే కాకుండా ఆకృతి కూడా కోల్పోతాయి.

గది ఉష్ణోగ్రతలో నిలువ చేయాలి. సూర్యరశ్మికి దూరంగా ఉంచాలి. ఆకు కూరలు కాగితపు టవల్‌లో చుట్టి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ప్లాస్టిక్‌ సంచిలో కూడా ఉంచవచ్చు.

క్యారెట్‌లను నీటితో శుభ్రంగా కడిగి కంటైనర్‌ ప్లాస్టిక్‌ ర్యాప్‌తో మూసివేసి, రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ కాలం షెల్ప్‌ లైఫ్‌ కోసం నిలువ చేయాలి.

ఫ్రిజ్‌లో పెట్టే ముందు క్యారెట్‌ ముందు భాగంలో ఉండే ఆకులను పూర్తిగా తొలగించాలి.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/