అద్భుత సౌందర్య సాధనం : పసుపు

అందమే ఆనందం

వంటింట్లో దొరికే అద్భుతమైన సౌందర్య సాధనం పసుపు. ఇది వయసు ప్రభావాన్ని కన్పించకుండా చేస్తుంది.. ఎలాగంటే..
పసుపు, సెనగపిండి , పచ్చి పాలు, సమపాళ్లలో కలపాలి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఇరవై నిముషాల తర్వాత గోరువెహాని నీళ్లతో కడిగేయాలి.. ఇది యాంటీ ఏజింగ్ గానూ పనిచేస్తుంది.. తక్కువ మోతాదులో పసుపు వాడి వేసుకునే ఈ ప్యాక్ చర్మ ఛాయను మెరుగు పరుస్తుంది..

ఇందులోని యాంటీ ఆక్సీడెంట్స్ వయసు కారణంగా వచ్చే ముడతలు రాకుండా నివారిస్తాయి. కొత్త కణాలను వృద్ధి చేస్తాయి.. చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి.. ఆ ఫలితం రావాలంటే పసుపుని ముఖానికి రాసి, పది నిముషాల తర్వాత నీళ్లతో కడగాలి..
సమపాళ్లలో పసుపు, బియ్యం పిండి, చెంచా చొప్పున పచ్చి పాలు, టమాటో రసం చేర్చి మెత్తగా చేయాలి.. ఈ మిస్త్రమని ముఖం , మెడకు రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.. దీంతో కాళ్ళ కింద నల్లటి వలయాలూ, ముడతలు పోతాయి..

‘తెర’ (సినిమా) వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/