కెటిఆర్‌ ఇలాఖాలో ఇండిపెండెంట్ల హవా

Minister KTR
Minister KTR

సిరిసిల్ల: సొంత ఇలాఖాలో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కెటిఆర్‌కు టిఆర్‌ఎస్‌ రెబల్స్‌గా బరిలో దిగిన ఇండిపెండెంట్లు షాక్‌ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గమైన సిరిసిల్ల మున్సిపాలిటీలో
టిఆర్‌ఎస్‌ వశమైంది. మొత్తం 39 వార్డుల్లో టీఆర్ఎస్ 24 స్థానాలు సాధించడంతో… ఆ పార్టీ గెలుపు ఖాయమైంది. అయితే మిగిలిన 15 స్థానాల్లో బిజెపి 3, కాంగ్రెస్‌ 2 స్థానాలు గెలుచుకోగా… స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందడం విశేషం. కెటిఆర్‌ ఇలాఖాలో ఇండిపెండెంట్లు ఈ స్థాయిలో విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇండిపెండెంట్లుగా గెలుపొందిన వారిలో ఎక్కువమంది టిఆర్‌ఎస్‌ కు చెందిన రెబల్స్‌గా తెలుస్తొంది. ఎన్నికలకు ముందుకు టిఆర్‌ఎస్‌ తరపున టికెట్ ఆశించిన చాలామంది… తమకు టికెట్ రాకపోవడంతో రెబల్స్‌గా బరిలోకి దిగారు. వారిలో 10 మంది విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు రెబల్స్‌ను బుజ్జగించేందుకు టిఆర్‌ఎస్‌ ఎంతగానో ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల కారణంగా కొంతమంది పోటీ నుంచి తప్పుకోగా… మరికొందరు మాత్రం బరి నుంచి తప్పుకునేందుకు ససేమిరా అన్నారు. పోటీలో నిలిచి గెలిచారు. అయితే రెబెల్స్‌ గెలుపొందినా వారిని తిరిగి టిఆర్‌ఎస్‌లోకి తీసుకునేది లేదని కెటిఆర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. దీంతో వీరంతా మళ్లీ టిఆర్‌ఎస్‌ గూటికి చేరతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/