నీ ఎమ్మెస్సీ సర్టిఫికెట్ బయటపెట్టు అంటూ కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

ప్రస్తుతం తెలంగాణ లో సర్టిఫికెట్స్ రాజకీయం నడుస్తుంది. మోడీ ఏంచదువుకున్నారో ..తనవద్ద ఏ సర్టిఫికెట్ ఉందొ చెప్పాలంటూ బిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో..బండి సంజయ్ సీఎంకు కేసీఆర్ కు సవాల్ విసిరారు. నీ ఎమ్మెస్సీ సర్టిఫికెట్ బయటపెట్టు అంటూ సవాల్ విసిరారు.

ప్రధాని మోడీ సమాజాన్ని చదివి దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళుతుంటే.. కేసీఆర్ కుటుంబం చదువుకున్న చదువును డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు ఉపయోగిస్తూ వేల కోట్లు దోచుకుంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే బీరు.. రమ్.. స్కాచ్ పార్టీ అని, కేసీఆర్ కుటుంబం అంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కవిత చదువుకుని లిక్కర్ స్కామ్ చేసిందని ఆరోపించారు. ఏప్రిల్ 8న హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన ఉన్న క్రమంలో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరేడ్ గ్రౌండ్ లను బీజేపీ నేతలతో కలిసి సంజయ్ పరిశీలించారు.

ఏప్రిల్ 4వ తేదీ మంగళవారం మోడీ పర్యటన ప్రాంతాల్లో రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు అందరూ పరిశీలించారు. TSPSC, టెన్త్ పేపర్ లీకులపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకుల జాతర నడుస్తోందని విమర్శించారు. 8 ఏళ్ల క్రితం ఇల్లు తప్ప ఏమీలేని కేసీఆర్ నేడు వేల కోట్లతో ప్రతిపక్ష పార్టీలకు డబ్బులిచ్చే స్థాయికి ఎట్లా ఎదిగారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో దేశంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని.. కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతారని జోస్యం చెప్పారు బండి సంజయ్.