మహారాష్ట్రలో పట్టపగలే దారుణం : ప్రేమను నిరాకరించిందని ఆయుధం తో దాడి

చట్టాలు ఎన్ని శిక్షలు తీసుకొచ్చిన కామాంధులు, ప్రేమ పిశాచులు మారడం లేదు. తమ కోరిక తీర్చాలని కొంతమంది , ప్రేమను ఒప్పుకోవాలని మరికొందరు ఆడవారి ఫై దాడికి పాల్పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ పేరుతో వేదింపులు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. ప్రేమ పేరుతో వేధించడం..ఒప్పుకోకపోతే హత్య చేయడం వంటివి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్నో వెలుగులోకి రాగా..తాజాగా మహారాష్ట్రలో పట్టపగలే దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని పదునైన ఆయుధంతో దాడి చేసాడో ఓ యువకుడు.

వివరాల్లోకి వెళ్తే..

పుణెలోని సదాశివ్‌ పేట్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రద్దీగా ఉన్న రోడ్డు మీద టూ వీలర్‌పై వెళ్తున్న 20 ఏళ్ల యువతిని యువకుడు అడ్డగించాడు. వెంటనే తన వద్ద ఉన్న పదునైన కత్తి వంటి ఆయుధాన్ని తీసి యువతిపై దాడికి యత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు స్కూటీ వదిలేసి యువతి వీధుల్లో పరుగెత్తింది. యువకుడు ఆమె వెంటే పరుగెత్తాడు. ఈ క్రమంలో ఆమె వీపుపై దాడి చేయడంతో కింద పడింది. మళ్లీ లేచి పరుగెత్తుండగా.. ఆ వ్యక్తి ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు. ఇంతలో రోడ్డుపై వెళుతున్న కొంతమంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు యువకుడిపై రళ్లు రువ్వారు. ఎట్టకేలకు యువతిని రక్షించి, దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. పంజాబీ డ్రెస్‌, ముఖానికి స్కార్ఫ్‌ ధరించిన యువతి భుజంపై బ్యాగ్‌తో రోడ్డుపై పరుగెత్తడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వైట్‌ షార్ట్‌, ప్యాంట్‌ వేసుకున్న యువకుడు ఆమె వెనకాల వెంబడించడం కూడా తెలుస్తోంది.