19 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్

వనపర్తి జిల్లా నుంచి ప్రారంభంకానున్న కేసీఆర్ పర్యటన

హైదరాబాద్: సీఎం కెసిఆర్ జిల్లాల పర్యటనను చేపట్టనున్నారు. ఆయన పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 19 (ఆదివారం) నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. వనపర్తి జిల్లా నుంచి తన పర్యటనను కేసీఆర్ ప్రారంభించనున్నారు. 19న వనపర్తి జిల్లాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కర్నె తాండ ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, కొత్త కలెక్టరేట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు.

ఈ నెల 20న జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ జిల్లాలో కూడా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నాగర్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/