సల్మాన్ – వెంకీ లతో చరణ్ లుంగీ డాన్స్

సల్మాన్ ఖాన్ , వెంకటేష్ లతో కలిసి చరణ్ లుంగీ డాన్స్ చేసి రచ్చ చేసాడు. సల్మాన్ ఖాన్ హీరోగా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2014లో అజిత్ చేసిన ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా రూపొందింది. ఏప్రిల్ 21వ తేదీన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. సల్మాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, ఫర్హాద్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమాలోని పలు సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ సినిమా ఫై అంచనాలు పెంచగా..తాజాగా సినిమాలోని ‘ఏంటమ్మా’ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు.

ఇందులో ప్రత్యేకత ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యామిలీతో పాటు నాన్న చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సల్మాన్ వెంకటేష్ లతో కలిసి డాన్స్ చేయడం. ఊర మాస్ స్టైల్ లో లుంగీని తొడలపైకి కట్టి ముఠామేస్త్రి స్టైల్ లో ముగ్గురు కలిసి కాలు కదుపుతుంటే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే పూజా హెగ్డే సైతం అదే గెటప్ లో తోడు కావడం మరో ఆకర్షణ. ఇక ఈ మూవీలో చరణ్ చిన్న క్యామియో చేశాడనే విషయం నెలల క్రితమే సల్మాన్ ఓ ప్రెస్ మీట్ లో చెప్పాడు. కానీ ఏ గెటప్ లో ఎలా వస్తాడనేది మాత్రం రివీల్ చేయలేదు. కానీ ఈ సాంగ్ తో తెలిసిపోయింది. ఈ సాంగ్ కు షబ్బీర్ అహ్మద్ హిందీ, తెలుగు భాషలో మిక్స్డ్ గా లిరిక్స్‌ అందించారు. పాటకు పాయల్ దేవ్ క్యాచీ ట్యూన్ కంపోజ్ చేశారు. విశాల్ దద్లానీ, పాయల్ దేవ్ అద్భుతంగా పాడారు. రాఫ్తార్ ర్యాప్ మ్యూజిక్ ను రాసి పాడారు. ప్రస్తుతం ఈసాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

YouTube video