స్త్రీల ఆరోగ్యం-సంరక్షణ

పోషకాహారం తోనే సాధ్యం

కుటుంబ సభ్యుల గురించి ప్రతి క్షణం ఆలోచించే మహిళ తన ఆరోగ్యాన్ని మాత్రం సరిగా పట్టించుకోదు . సరైన పోషకాహారం తీసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సొంతం అవుతుంది… మరి అందుకోసం ఏయే పదార్ధాలు తీసుకోవాలో చూద్దాం

Women’s health with nutrition

ఆకు కూరలు:

వీటిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్ సి, కె, మెండుగా ఉంటాయి.. ఇవి మహిళల్లో రక్తహీనత లేకుండా, ఎముకలు వబలంగా ఉండటానికి సాయపడతాయి.

నట్స్:

ఈ ఎండుగింజల్లో విటమిన్లు, కొవ్వులు మెండుగా ఉంటాయి.. ఇవి ఎముక ఆరోగ్యంతో పాటు, మెదడునూ చురుగ్గా ఉంచుతాయి.. కాబట్టి రోజూ బాదం, కాజూ, వాల్ నట్స్ , పిస్తా లన్నీ కలిపి ఓ గుప్పెడయినా తినేయండి..

టొమాటోలు:

ఇవి రొమ్ము, సర్వేకల్ క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటాయట.. అలాగే గుండె సంబంధ సమస్యలను కూడా..

అవిసె గింజలు:

ఇందులో ఒమేగా 3 ఫాటీ ఆంలాలు, పీచు మెండుగా ఉంటాయి.. వీటిలోని లిగ్నాన్స్ అనే సమ్మేళనాలు స్త్రీలలో మెనోపాజ్ సమయంలో వచ్చే వేడి ఆవిర్లను, చేదు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి..

క్యారెట్ :

ఇది నాడులకు శక్తిని అందిస్తుంది.. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.. మెండుగా వుండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యంతో పాటు చర్మాన్ని మెరిపిస్తుంది..

గ్రీన్ టీ:

ఇది కాన్సర్ కారకాలు, గుండె జబ్బులతో పోరాడుతుంది.. అంటే కాదు మాత్రిమరుపుని అడ్డుకుంటుంది.. వీటన్నిటితో పాటు అరటి పండు, డార్క్ చాకోలెట్ , ఆపిల్స్, చేపలు, పాలు, సొయా, పెరుగు, గుడ్లు ఆహారంలో చేర్చుకోవాలి.. నీళ్లు శరీరంలోని మలినాలు, విష పదార్ధాలను బయటకు పంపుతాయి.. ఇందుకోసం రోజులో 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/