నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు

పరీక్షలు రాస్తున్న 5,09,275 మంది విద్యార్థులు

హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు వచ్చే నెల 1 వరకు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గంటల వరకు ఉంటాయి. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 406 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం గమనార్హం. అత్యల్పంగా జయశంకర్‌ భూపాలపల్లిలో కేవలం 20 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి.గత రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. అయితే ఈ సారి అనుకూల పరిస్థితులుండటంతో ..పరీక్ష సిలబస్‌ ను 70 శాతానికి కుదించి..11 పేపర్లకు గాను ఆరు పేపర్లకు తగ్గించారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 86 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు డీఈవో రోహిణి ప్రభన్యూస్‌తో చెప్పారు.

కాగా, పరీక్షల పర్యవేక్షణకు సంబంధించి మొత్తం 17 ఫ్లైయింగ్‌ స్కాడ్స్‌ ను..ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుతో పాటు, సమీపంలోని జీరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/