నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Telangana cabinet sub committee meeting today

హైదరాబాద్‌ః నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్‌ ఉంది. సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా అభయ హస్తం దరఖాస్తులపై చర్చ జరుగనుంది. ఇక ఇప్పటికే దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తుంది సిబ్బంది. కాగా, నేడు ఇరిగేషన్ శాఖ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇరిగేషన్ శాఖ పై విజిలెన్స్ దాడులు, కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై ఈ సందర్ఢంగా చర్చ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ శాఖ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.