మూడు రోజుల పాటు తెలంగాణ లో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచనా తెలియజేసింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రాగల 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. పశ్చిమ/వాయవ్య దిశల నుంచి దిగువ స్థాయిలోని గాలులు తెలంగాణ వైపుగా వీస్తున్నాయి. దీంతో మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నిన్న నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కాగా, నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో గత రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు, వచ్చి చేరుతోంది వరద. ప్రస్తుతం ప్రాజెక్టు లోకి 50వేళా క్యూస్సేక్కులు ఇన్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిల నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1090.60 అడుగులు ఉంది.