ఏపీ గ్రామ పంచాయితీ ఉప ఎన్నికల్లో సత్తా చాటిన వైస్సార్సీపీ

ఏపీలో శనివారం 34 సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా..ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. మొత్తం 34 స్థానాలకు గాను వైస్సార్సీపీ 22, వైస్సార్సీపీ రెబల్-1, టీడీపీ 9, టిడిపి+జనసేన మద్దతుదారులు 2 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అటు 245 వార్డు స్థానాలకుగాను వైస్సార్సీపీ మద్దతు దారులు 141, వైస్సార్సీపీ రెబల్ 2, టీడీపీ+జనసేన ఒకటి, సిపిఎం-1, ఇతరులు మూడు చోట్ల గెలుపొందారు.

నామినేషన్లు రాకపోవడంతో రెండు చోట్ల ఎన్నిక నిర్వహించలేదు. ఇక అటు పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంపై పార్టీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులు, నాయకులకు చంద్రబాబు అభినందనలు చెప్పారు. గతంలో వైస్సార్సీపీ చేతిలో ఉన్న ఈ స్థానాలను.. ఉప ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకోవడం శుభ పరిమాణమన్నారు.