పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్

ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచమై..రాణిస్తున్నారు. అయితే ఈ షో ద్వారా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఓ కమెడియన్ కామ్ సింగర్ మాత్రం యువతిని ప్రేమ , పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకొని వార్తల్లో నిలిచాడు. హైదరాబాద్ లోని గోల్కొండ లో ఉంటున్న ఓ యువతిని జబర్దస్ కమెడియన్, సింగర్ నవ సందీప్..గత కొద్దీ రోజులుగా ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.

ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నాని చెప్పి ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెళ్లి చేసుకొమ్మని అంటే..పెళ్లి లేదు..ఏమి లేదు అంటూ మాట మార్చాడు. దీంతో సదరు యువతీ మదురా నగర్ పోలీస్ స్టేషన్లో సందీప్ ఫై పిర్యాదు చేసింది. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.