విటమిన్ – డి అందుతోందా ?

ఆహారం – ఆరోగ్యం

మన సంపూర్ణ ఆరోగ్యానికి , ఇమ్యూనిటీని మెరుగు పరచుకోవటానికి మనం తీసుకునే ఆహారం కీలకం అన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి పెంచటంలో విటమిన్ -డి పాత్ర ఎంత కీలక మైనదో తెలిసిందే.. ఈ క్రమంలో విటమిన్ -డి లోపం లేకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే ఆహార పదార్ధాలు మెనూ లో చేర్చుకోవాలి? వాటి గురించి తెలుసుకుందాం..

పాలు , పెరుగు:

ఆవు పాలలో విటమిన్ -డి అధికముగా ఉంటుంది.. రోజుకు ఒక గాల్సు వేళ్ళతో కూడిన ఆవుపాలు తాగటం వలన రోజుకో కావాల్సిన మొత్తంలో 20 శాతం దాకా ఈ విటమిన్ శరీరానికి అందించవచ్చు.. అలాగే ఇందులో వుండే కాల్షియం కూడా ఎముకల ఆరోగ్యనికి చాలా అవసరం.. పెరుగులో కూడా ప్రోటీన్లతో పాటు ‘డి’ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.. అయితే బయట దొరికే పెరుగులో చాలావరకు ఫ్లేవర్లు ఉంటాయి.. అందుకే ఇంట్లోనే పెరుగు తోడేకునే తీసుకోవటం మంచిదని నిపుణులు అంటున్నారు.

పుట్టగొడుగులు:

పుట్టగొడుగులు ఎండలోనే పెరుగుతాయి.. కాబట్టి వీటిలో విటమిన్ -డి స్థాయిలు ఎక్కువగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు.. దీంతో పాటు బి1.బి 2, బి 5, కాపర్, వంటి పోషకాలు కూడా పుట్టగొడుగుల్లో అధికంగా ఉంటాయి. అయితే పుట్టగొడుగుల్లోనూ బటన్ మష్రూమ్స్ , స్ట్రా మష్రూమ్స్ ..ఇలా వివిధ రకాలుంటాయి.. కాబట్టి ఆయా రకాలను బట్టి విటమిన్-డి స్థాయిలు మారుతూ ఉంటాయి.

పావు గంట ఎండలో..

సూర్య రశ్మి నుంచి మన శరీరానికి అధిక మొత్తంలో విటమిన్ -డి అందుతుంది.. ఇది శరీరం కాల్షియం ను గ్రహించటంలో సహకరిస్తుంది.. తద్వారా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.. అలాగే ‘డి’ విటమిన్ నాడులు , కండరాల ఆరోగ్యనికి అవసరం.. అంతేకాదు.. రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరచటంలోనూ దీనికిదే సాటి.. కాబట్టి ప్రత్యేకించి ఈ కాలంలో కనీసం ఎండ వచినపుడైనా సరే రోజూ ఉదయాన్నే లేలేత సూర్య కాంతిలో కనీసం 15 నిముషాలైనా నిలబడమని నిపుణుల సలహా..

ఇవి కూడా.

  • కమలా ఫలంలో విటమిన్ -సి , డి పుష్కలంగా ఉంటాయి.. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవటానికి దోహదం చేస్తాయి.. కాబట్టి ఉదయాన్నే ఓ గ్లాసు కమలా ఫలం జ్యూస్ ని అల్పాహారంగా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.. అయితే అది కూడా ఇంట్లోనే తయారుచేసుకోవాలన్న విషయం మర్చిపోకండి..
  • విటమిన్ -డి అధికంగా లభించే పదార్ధాల్లో ఓట్స్ కూడా ఒకటి… అలాగే ఇందులోనే అత్యవసర ఖనిజాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యానికి , చక్కటి శరీరాకృతికి చాలా అవసరం..
  • విటమిన్ -డి తో పాటు ప్రోటీన్లు కూడా గుడ్డులోని పచ్చసొనలో పుష్కలంగా ఉంటాయి.. అలాగే ఇందులో కొవ్వులు కూడా ఎక్కువగా ఉంటాయి.. అయితే రోజుకు ఒక పచ్చ సొన కంటే ఎక్కువ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.. కావాలంటే ఇందులో రుచి కోసం కొన్ని కాయగూర ముక్కలను కలుపుకుని ఆమ్లెట్ లా వేసుకుని తీసుకోవచ్చు.
  • చేపల్లోనూ విటమిన్ -డి స్థాయిలు ఎక్కువే.. అలాగే ఇందులో వుండే కాల్షియం, ప్రోటీన్లు, పాస్ఫరస్ వంటి పోషకాలు సంపూరణ ఆరోగ్యానికి సహకరిస్తాయి.

‘నాడి’ (మరిన్ని ఆరోగ్య సంబంధ వ్యాసాలు) కోసం : https://www.vaartha.com/specials/health1/