దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి.. ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని వెలంపల్లి ఫైర్

వైస్సార్సీపీ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని మండిపడ్డారు. ప్రజారాజ్యంలో అసలైన కోవర్టు పవన్ కళ్యాణ్ అని.. చిరంజీవి 18 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కాగానే బయటకు వెళ్ళిపోయిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆగ్రహించారు. యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా? ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం పీకాడని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం విలీనానికి మొదటి కారణం పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు వెల్లంపల్లి. నాడు ప్రజారాజ్యం ను విలీనం చేయవద్దని పవన్‌ ఎందుకు చెప్పలేకపోయాడు? మేం పిలుస్తున్నా పవనే రావడం లేదని స్వయంగా నాగబాబు.. మెగా అభిమానుల మధ్య చెప్పాడు. చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడున్నాడు?. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ, పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌గా కూడా గెలవలేడు అని వెల్లంపల్లి జోస్యం చెప్పారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తున్న ప్రభుత్వం తమదని.. పథక లబ్ధి అందుకుంటున్న వాళ్లలో టీడీపీ కార్యకర్తలు కూడా ఉంటున్నారని ఆయన గుర్తు చేశారు.