మెటర్నల్‌ షాక్‌లో రకాలు

రోగి కండిషన్‌ని బట్టి కారణాల్ని బట్టి మెటర్నల్‌ షాక్‌ని స్థూలంగా 4 తరగతులుగా విభజించవచ్చు. మొదటి హేమరేజిక్‌ షాక్‌: 6- 7 శాతం మందిలో ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత కలిగే అధిక రక్తస్వ్రాఆల వల్ల షాక్‌ ఏర్పడుతుంది.

00 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువగా రక్తస్వ్రాం కలుగుతుంది. ఇది గర్భస్థ పిండం చనిపోవడం, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ, ప్లాసెంటా ప్రీలియా, ఆపరేషన్స్‌ మావి ప్రసవం కాకపోవడం, ఉమ్మనీరు పోవడం, గర్భస్థ పిండం గుండె నుండి వచ్చే ఐవిసి పై ఒత్తిడి కలిగించడం వల్ల అరుదుగా ఉమ్మనీటి ఎంబాలిజమ్‌ వల్ల కూడా హేమరేజిక్‌ షాక్‌ వస్తుంది.

రెండవది సెప్టిక్‌ : ఎండో టాక్సిక్‌ షాక్‌: 3 శాతం మందిలో సెప్టిక్‌ అబార్షన్‌, కోరియో అమ్నియోనైటిస్‌, పయిలోనైఫ్రెటిస్‌, పోస్ట్‌ పార్టమ్‌ ఎండో మైట్రైటిస్‌. కార్డియోజెనిక్‌ షాక్‌: 1,500-4000 కేసుల్లో ఒకరికి వస్తుంది. పల్మోనరీ ఎంబాలిజమ్‌, కార్డియాక్‌ అరెస్ట్‌, మయోకార్డియల్‌ ఇన్‌ఫ్రాక్షన్‌ ఎడమవైపు వెంట్రిక్యులార్‌ ఫెయిల్యూర్‌, హ్యాపి ఫెయిల్యూర్‌ వంటి గుండె జబ్బులున్న గర్భిణుల్లో మెటర్నల్‌ షాక్‌ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

న్యూరోజెనిక్‌ షాక్‌ : అనస్థీషియా ఎఫెక్ట్‌ వల్ల, సిజేరియన్‌ ఆపరేషన్‌, ఫోర్‌సెప్స్‌ డెలివరి, గర్భసంచి చీలడం, ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం, ఇంటర్నల్‌ వర్షన్‌, గర్భసంచి మడత పడడం, బిడ్డ అబ్‌నార్మల్‌ పొజిషన్‌లో ఉండడం. కెమికల్‌ ఇంజ్యూరీస్‌ వల్ల న్యూరోజెనిక్‌ షాక్‌ వస్తుంది.

లక్షణాలు:

శరీరం చల్లగా పాలిపోవడం ఉంటుంది. అతి చెమటలు, వణకడం, కళ్లు తిరగడం, స్పృహ తప్పడం, అస్థిమితం, ఆందోళన, బి.పి.పల్స్‌, టెంపరేచర్‌ తక్కువగా ఉండడం, శ్వాస వేగంగా కష్టంగా మారడం, శరీరం నీలంగా మారడం, మూత్రం రాకపోవడం, కళ్లు బైర్లు కమ్మి చూపు మసకగా ఉంటుంది. వ్యాధి నిర్ధారణ: స్కానింగ్‌, ఎక్స్‌రే. ఇసిజి, బి.పి. టెంపరేచర్‌ చార్ట్‌, ఫీటాస్కోపీ, రక్తమూత్ర పరీక్షలు, బయోకెమికల్‌, ఎలక్రోలైట్‌, కిడ్నీ లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్స్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.

కాంప్లికేషన్స్‌:

ఆర్గాన్‌ డామేజ్‌, కణాల డిజనరేషన్‌, వెక్రోసిస్‌, రక్తస్రావాలు, కార్డియోమయోపతి, రీనల్‌ ఫెయిల్యూర్‌, కొరనరీ ఇస్కేమియా, అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కావడం. హెమటోమా. బాలింత ఇన్ఫెక్షన్‌, కోమా 3-4 అవయవాల డామేజ్‌ అయినట్లయితే మరణం వంటి కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. చికిత్స: వ్యాధి నిర్ధారణ సకాలంలో చేసినట్లయితే కాంప్లికేషన్స్‌ త్వరితగతిన అరికట్టవచ్చు. 1-3 రోజుల్లో లక్షణాల్ని బట్టి సపోర్టిన్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్లయితే 90 శాతం మెటర్నల్‌ షాక్‌ని నయం చేయవచ్చు. ఇన్షెక్షన్‌ని, రక్తస్రావాన్ని కంట్రోల్‌ చేయాలి.

ప్రసవ సమయంలో కలిసే గాయాల్ని, చీలికల్ని కర్టల్‌ చేయడం మంచిది. వ్యాధి తీవ్రత, రక్తస్రావం స్థాయిని బట్టి బ్లడ్‌ ట్రాన్స్‌ప్యూజన్‌ చేయాలి. అవసరమైతే రోగి కండిషన్‌ని బట్టి లా హిస్టరెక్టమీ ఆపరేషన్‌ చేయడం మంచిది. ఐ.వి. ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలి. మావిని సకాలంలో ప్రసవం చేయడం, గర్భసంచిని క్లీన్‌ చేయడం మంచిది. అనస్థీషియా, ఎలర్జిక్‌ రియాక్షన్‌, మందుల డోవర్‌డోస్‌ లేకుండా చూడాలి. హస్పిటల్‌ కాన్పు కావడం అన్ని విధాలా తల్లి బిడ్డల ఆరోగ్యానికి మంచిది.

అవసరమైతే ఆక్సిజన్‌ థెరపీ, విశ్రాంతి అవసరం. సాధ్యమైనంత వరకు రోగిని కదల్చరాదు. మల్టీవిటమిన్స్‌, కాల్షియం, ఉప్పు లేకుండా చప్పటి ఆహారం,వేడి ద్రవపదార్థాల్ని రోగి కండిషన్‌ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. రోగిని వెచ్చగా ఉంచడం మంచిది. ఫిజికల్‌గా మెంటల్‌గా ధైర్యం కలిగించాలి. రోగిని ఒకే పొజిషన్‌లో కాకుండా కదలించాలి. గ్లూకోకార్టికాయిడ్స్‌ వాడడం వల్ల మెటబాలిక్‌ అసిడోసిస్‌ని ఇన్ఫెక్షన్‌ తీవ్రతను తగ్గించవచ్చు.

కొందరిలో కొరనరీ స్పాజమ్‌ వల్ల పోస్ట్‌ పిట్యూటరీ షాక్‌ 1-2 గంటల్లో ఏర్పడితే రోగికి వెంటిలేటర్స్‌ ద్వారా చికిత్స అందించాలి. షాక్‌ తీవ్రత, రోగి కండిషన్‌, ప్రతిస్పందనను బట్టి చికిత్స అందించాలి. గర్భం చీలినప్పటి నుండి రెగ్యులర్‌ చెకప్‌లు చేయించుకుంటూ హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ కేసుల్ని ముందు గుర్తించడం అన్ని విధాలా మంచిది.

  • డాక్టర్‌. కె.ఉమాదేవి,
    తిరుపతి

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/