ఇది కుల రాజకీయమా? కుటిల రాజకీయమా?: పురంధరేశ్వరి పై విమర్శలు

vijayasai-reddy-comments-on-purandeswari

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయ సాయిరెడ్డి మరోసారి పురంధరేశ్వరిపై విమర్శలు చేశారు. బిజెపి పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నావా అంటూ ఆగ్రహించారు. అమ్మా పురందేశ్వరి గారూ…తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మీ మరిది గారి టిడిపి బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టిడిపికి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే… మీది కుటుంబ రాజకీయమా? అని నిలదీశారు. ఇది కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బిజెపిని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా? అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి, మీరు, మీ కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా ? అని నిలదీశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు? అని సాయిరెడ్డి ప్రశ్నించారు.