విగ్రహ ఏర్పాటు ద్వారా కైకాల సత్యనారాయణ కలకాలం జీవించే ఉంటారుః కొడాలి నాని

గుడివాడలో కైకాల సత్యనారాయణ విగ్రహానికి భూమి పూజ

kodali nani
kodali nani

అమరావతిః తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం, దివంగత కైకాల సత్యనారాయణపై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ప్రశంసలు కురిపించారు. సత్యనారాయణ ఒక మహానుభావుడు అని అన్నారు. వ్యక్తిగతంగా ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా గుడివాడ అభివృద్ధికి ఆయన కృషి చేశారని కొనియాడారు. గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయం సెంటర్లో సత్యనారాయణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉదయం భూమి పూజను నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం కొడాలి నాని చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటు ద్వారా సత్యనారాయణ కలకాలం జీవించే ఉంటారని చెప్పారు.