దేశంలో 200 లకు చేరిన ఒమిక్రాన్ కేసులు
two-hundred-omicron-cases-reported-in-india-so-far
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 200 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 2, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు చెప్పింది. సోమవారం వరకు దేశంలో 174 కేసులు నమోదవగా.. మంగళవారం వరకు 200కు పెరిగాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 28 మంది, ఢిల్లీలో 12 మంది, కర్ణాటకలో 15 మంది, రాజస్థాన్‌లో 18, ఉత్తరప్రదేశ్, ఏపీ, బెంగాల్‌లో బాధితులు కోలుకున్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/