పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: పాన్‌ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు తుది గడువును కేంద్రం ఆరు నెలలు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి వరకు గడువు పొడిగిస్తున్నట్టు సీబీడీటీ ప్రకటించింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ముందుగా నిర్ణయించిన గడువు ఈ నెల 30తో ముగియనున్నది. ఐటీ చట్టం కింద పెనాల్టీ ప్రొసీడింగ్స్‌కు కూడా గడువును మార్చి 31 వరకు పొడిగించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/