బండి సంజయ్ యాత్ర ఫై భట్టి విక్రమార్క ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయం వద్ద నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించనున్నారు. కాగా బండి సంజయ్ చేపట్టనున్న ఈ యాటర్ ఫై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేసారు. బండి సంజయ్ ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారు… ధరలు తగ్గించాలిన పాదయాత్ర చేస్తున్నారా..? ధరలు ఇంకా పెంచాలని యాత్ర చేస్తున్నారా..? పేదల ఎకౌంట్లలో రూ. 15 లక్షల వేయనందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు పాదయాత్ర చేస్తున్నారా..? అంటూ విక్రమార్క ప్రశ్నించారు.

పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించమని యాత్ర చేయడం లేదని విమర్శించారు. భారత రాజ్యాంగం చెప్పిన లౌకికవాద ప్రజాస్వామ్య భారత దేశాన్ని నిర్మించాలని అంబేద్కర్ గారు చెబితే.. ఆయన పుట్టిన రోజే ఈ దేశాన్ని మతం పేరుతో విచ్ఛిన్నకర శక్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని, జాతిని విడగొట్టాలని చూస్తున్నారని… కేవలం అధికారాన్ని అనుభవించాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్న బండి సంజయ్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కొంత విరామం తీసుకున్న భట్టి .. తిరిగి మళ్ళీ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మండుటెండలో సైతం పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.